Ashes icc Fine : యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో స్లోగా ఓవర్ రేట్ ప్రదర్శించినందుకు ఇరు జట్లకు ఐసీసీ జరిమానా విధించింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ టెస్టులో ఇరు జట్లు నెమ్మదిగా బౌలింగ్ చేసినట్లు ఐసీసీ తెలిపింది. ఈ క్రమంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టిక నుంచి రెండు జట్లు.. చెరో రెండేసి పాయింట్లను కోల్పోనున్నాయి. అంతే కాకుండా ఇరు జట్ల ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత కూడా విధించినట్లు ప్రకటించారు. కేటాయించిన సమయంలోపు రెండు ఓవర్లు తక్కువగా వేశారని మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ఆ జరిమానా కట్టేందుకు అంగీకరించారు.
ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, ఆటగాళ్లకు నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయడంలో విఫలమైతే.. ప్రతీ ఓవర్‌కు వారి మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధింస్తారు. ఈ క్రమంలో 2 రెండు ఓవర్లు ఆలస్యమైనందున మ్యాచ్ ఫీజ్‌లో 40 శాతం జరిమానా విధించారు.