Aus vs Pak World Cup 2023 :2023 వరల్డ్‌కప్‌లో బెంగళూరు వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా - పాకిస్థాన్ మ్యాచ్‌లో ఆసీస్ అదరగొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (163 పరుగులు), మిచెల్ మార్ష్ (121 పరుగులు) భారీ శతకాలతో.. పాక్ బౌలర్లను బెంబేలెత్తించారు. వీరిద్దరు మినహా ఆసీస్ బ్యాటర్లలో ఎవరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఇక పాకిస్థాన్ బౌలర్లలో షహీన్ అఫ్రిదీ 5, హారిస్ రౌఫ్ 3, ఉస్మాన్ మీర్ ఒక వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ ఎక్కడా పాక్ బౌలర్లకు ఛాన్స్ ఇవ్వలేదు. వీరిద్దరూ ఆరంభం నుంచే వారిపై ఎదురుదాడికి దిగారు. పోటీపడి మరీ బంతిని బౌండరీ దాటించారు. ఈ ద్వయం తొలి వికెట్‌కు 259 పరుగులు జోడించింది. ఈ క్రమంలో ఈ ఇద్దరూ శతకాలు పూర్తి చేశారు. వార్నర్‌కు ఇది వన్డే కెరీర్లో 21వ సెంచరీ కాగా.. మార్ష్‌కు కెరీర్లో రెండో శతకం. ఇక 33.5 ఓవర్ వద్ద మార్ష్ ఔటవ్వగా.. 42.2 ఓవర్ వద్ద వార్నర్ పెవిలియన్ చేరాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత ఆసీస్.. టపాటపా వికెట్లు పారేసుకుంది. జట్టులో ఏ ఒక్క బ్యాటర్ నిలకడగా ఆడినా.. ఆసీస్ స్కోరు 400 దాటేది.