AUS Vs PAK Test Series Results :పాకిస్థాన్‌ను వైట్‌వాష్ చేసింది ఆస్ట్రేలియా. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టులో 8 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. తన కెరీర్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆసీస్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ హాఫ్ (57) సెంచరీతో రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూ జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. లబుషేన్ (62) పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అంతకుముందు 68/7 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించింది పాకిస్థాన్. కానీ 115 పరుగులకే కుప్పకూలింది. కంగారూ బౌలర్లలో హేజిల్‌వుడ్ (4), లయోన్ (3), స్టార్క్ (1), కమిన్స్ (1), హెడ్ (1) వికెట్లు తీశారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో వచ్చిన 14 పరుగుల ఆధిక్యం కలుపుకుని ఆసీస్‌కు 130 లక్ష్యాన్ని నిర్దేశించింది పాక్.
మూడో టెస్ట్ సాగిందిలా
- పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 313-10 (77.1 ఓవర్లు)
- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 299-10 (109.4 ఓవర్లు)
- పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ : 115-10 (43.1 ఓవర్లు)
- ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 130-2 (25.5 ఓవర్లు)