తెలంగాణ

telangana

ETV Bharat / sports

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన అంపైర్- ఆగిపోయిన టెస్ట్​ మ్యాచ్! వీడియో వైరల్‌ - పాక్ ఆసీస్ టెస్ట్ అంపైర్

AUS VS PAK Test 2023 : ఆస్ట్రేలియా, పాకిస్థాన్​ రెండో టెస్ట్​లో ఊహించని ఘటన జరిగింది. ఈ మ్యాచ్‌కు థర్డ్‌ అంపైర్‌గా వ్యవహరిస్తున్న థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. దీంతో మ్యాచ్‌ కాసేపు ఆగిపోయింది.

AUS VS PAK Test 2023
AUS VS PAK Test 2023AUS VS PAK Test 2023

By ETV Bharat Telugu Team

Published : Dec 28, 2023, 11:19 AM IST

Updated : Dec 28, 2023, 11:25 AM IST

AUS VS PAK Test 2023 :సాధారణంగా క్రికెట్‌లో వర్షం, వెలుతురు లేమి, సాంకేతిక కారణాల వల్ల మ్యాచ్‌ ఆగిపోవడం చూస్తూ ఉంటాం. కానీ మెల్‌బోర్న్‌ వేదికగా పాకిస్థాన్​- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఊహించని ఘటనతో ఆటకు అంతరాయం ఏర్పడింది. ఈ మ్యాచ్‌కు థర్డ్‌ అంపైర్‌గా వ్యవహరిస్తున్న రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు

దీంతో దాదాపు ఐదు నిమిషాల పాటు మ్యాచ్‌ ఆగిపోయింది. మూడో రోజు లంచ్‌ బ్రేక్‌ తర్వాత తిరిగి ఆటను ప్రారంభించేందుకు అన్‌ఫీల్డ్‌ అంపైర్లు సిద్దమయ్యారు. ఈ క్రమంలో కెమెరామెన్‌ థర్డ్‌ అంపైర్‌ బాక్స్‌ వైపు కెమెరాను టర్న్‌ చేయగా సీటులో ఇల్లింగ్‌ వర్త్ కన్పించలేదు. దీంతో ఆటను అంపైర్‌లు ప్రారంభించలేదు.

వెంటనే ఈ విషయాన్ని ఫోర్త్‌ అంపైర్‌కు ఫీల్డ్‌ అంపైర్‌లు తెలియజేయగా అతడు ఏమైందోనని థర్డ్‌ అంపైర్‌ గదికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఇంతలోనే లంచ్ పూర్తి చేసిన తర్వాత ఇల్లింగ్‌ వర్త్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడని కామెంటేటర్‌లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఆసీస్‌ ఆటగాళ్లు ఒక్కసారిగా నవ్వుకున్నారు. అయితే ఐదు నిమిషాల తర్వాత థర్డ్‌ అంపైర్‌ తిరిగి రావడంతో మ్యాచ్‌ ప్రారంభమైంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

పాక్‌ ఖాతాలో చెత్త రికార్డు
టెస్టు క్రికెట్‌లో పాకిస్థాన్​ జ‌ట్టు ఓ చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్​ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 52 ప‌రుగుల‌ను ఎక్స్‌ట్రాల రూపంలో ఇచ్చింది. ఈ క్రమంలో ఓ చెత్త రికార్డును న‌మోదు చేసింది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఓ టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఎక్స్‌ట్రాలు ఇచ్చిన జ‌ట్టుగా పాక్ అపఖ్యాతి మూటగట్టుకుంది. ఎక్స్‌ట్రాస్‌లో 15 వైడ్‌లు, 20 బైలు, 2 నోబాల్స్‌ ఉన్నాయి. 1995 నుంచి పాకిస్థాన్​ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి కూడా ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెల‌వ‌లేదు. మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో కొన‌సాగుతోంది. రెండో టెస్టు మ్యాచులో సైతం ఆస్ట్రేలియా క్రమంగా ప‌ట్టు బిగిస్తోంది.

Last Updated : Dec 28, 2023, 11:25 AM IST

ABOUT THE AUTHOR

...view details