తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​ను ఆదుకునేందుకు ఆసీస్ క్రికెటర్లు ఒక్కటిగా!

భారత్​లో కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు ఆసీస్ క్రికెటర్లు, విరాళాలు సేకరించనున్నారు. గురువారం జరిగే ఆన్​లైన్​ కార్యక్రమం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించనున్నారు.

AUS cricketers to chip in for India Covid-19 relief through gaming
ఆసీస్ క్రికెటర్

By

Published : Jun 2, 2021, 6:26 PM IST

కొవిడ్​తో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న మన దేశానికి సాయం చేసేందుకు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు సిద్ధమయ్యారు. గురువారం వర్చువల్​గా జరగనున్న ఓ కార్యక్రమంలో కమిన్స్, స్టార్క్, హేజిల్​వుడ్, లైయన్​తో పాటు ఆ దేశ మహిళా క్రికెటర్లు కూడా పాల్గొనున్నారు. లక్ష డాలర్ల విరాళాలే లక్ష్యంగా దీనిని​ నిర్వహించనున్నారు.

ఈ లైవ్​ స్ట్రీమ్​లో క్రికెట్​కు సంబంధించిన విషయాలు చర్చించడం సహా, సదరు క్రికెటర్లు వీడియో గేమ్స్ కూడా ఆడనున్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు మొదలయ్యే ఈ ప్రోగ్రాం.. అర్ధరాత్రి 12:30 గంటల వరకు సాగనుంది.

భారత్​లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో వేల సంఖ్యలో ప్రజలు మరణిస్తుండగా, లక్షల సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారు. దీని తీవ్రత వల్లే ఐపీఎల్(IPL) కూడా వాయిదా పడింది.

ఇది చదవండి:WARNER: 'భారత్​లో ఆ దృశ్యాలు చూసి కలత చెందా'

ABOUT THE AUTHOR

...view details