టీమ్ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి మధ్య ప్రేమ వ్యవహారం(kl rahul athiya shetty love story) నిజమేనన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంలో రాహుల్ తనవాడు అన్నట్లుగా అతియా ట్వీట్ చేయగా.. శుక్రవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా రాహుల్ చేసిన పోస్ట్(athiya shetty birthday wishes) ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇరువురు కలిసి దిగిన ఓ చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టిన రాహుల్.. 'హ్యాపీ బర్త్‌డే మై లవ్' అని క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో వీరి ప్రేమ వ్యవహారంపై అందరికీ ఓ క్లారిటీ వచ్చినట్లయింది.
అతియాతో ప్రేమ వ్యవహారం.. రాహుల్ చెప్పేశాడు! - అతియా బర్త్‌డే విషెస్
టీమ్ఇండియా క్రికెటర్ రాహుల్(kl rahul news), బాలీవుడ్ నటి అతియా శెట్టి ప్రేమ వ్యవహారం(kl rahul athiya shetty love story)పై ఇన్నాళ్లు పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా రాహుల్ చేసిన ఓ ట్వీట్ వీరి లవ్ అఫైర్‌పై ఓ క్లారిటీ ఇచ్చింది.

రాహుల్
అతియా.. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయ. 'హీరో', 'మోతిచూర్ చక్నాచూర్', 'నవాబ్జాదే', 'ముబారకాన్' వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించింది. ఈమె సోదరుడు అహాన్ శెట్టి కూడా త్వరలోనే తెరంగేట్రం చేయనున్నాడు.
రాహుల్(kl rahul news) ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో అదరగొడుతున్నాడు. శుక్రవారం స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో 18 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశాడు. తద్వారా టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) మొదటి స్థానంలో ఉన్నాడు.