Asian Games Cricket :ఆసియా క్రీడల్లో భాగంగా జరగుతున్న క్రికెట్ టోర్నీలో టీమ్ఇండియా మహిళల జట్టు దూసుకెళ్లింది. వర్షం కారణంగా అంతరాయం ఏర్పడినప్పటికీ మలేసియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో తమదైన స్టైల్లో చెలరేగి సెమీస్‌లోకి అడుగుపెట్టారు. ఇక ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ప్లేయర్ షెఫాలీ వర్మ ధనాధన్ రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
మ్యాచ్ జరిగిందిలా..
India Vs Malaysia : వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా.. మైదానంలో పరుగుల వరదను పారించింది. ఇక షెఫాలీ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి అందరిని అబ్బురపరిచింది. కేవలం 39 బాల్స్‌లోనే ఐదు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో కొట్టి 69 పరుగులను తన ఖాతాలోకి వేసుకుంది.
ఈ మ్యాచ్‌లో షెఫాలీతో పాటు జెమియా రొడ్రిగస్ రాణించి జట్టును విజయ పథంలోకి నడిపించారు. ఆడిన 29 బాల్స్‌లో ఆరు ఫోర్లతో జెమియా 47 పరుగులు చేసింది. చివర్లో మైదానంలో దిగిన రిచా ఘోష్ ఏడు బాల్స్‌లోనే ఓ సిక్సర్, మూడు ఫోర్లతో 21 పరుగులు చేసింది. దీంతో 15 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి భారత మహిళల జట్టు 173 రన్స్ చేసింది.