Asian Games 2023 Womens Cricket Final :భారత్‌లో క్రికెట్‌కు ఉండే క్రేజ్ వేరు. టీమ్ఇండియా ఏదైనా టోర్నమెంట్లో పాల్గొంటుందంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే రీసెంట్గా భారత్.. 2023 ఆసియా కప్ టోర్నీ ఫైనల్లో ఆతిథ్య శ్రీలంక జట్టును మట్టికరిపించి.. ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి.. ఇంకో 24 గంటల్లోపు ఓ ఫైనల్లో భారత్-శ్రీలంక మధ్య పోరు జరగనుంది.
సెప్టెంబర్ 25 సోమవారం ఫైనల్ పోరులో భారత్.. శ్రీలంకను ఢీకొట్టనుంది. అయితే ఇది పురుషుల జట్లు మధ్య కాదండోయ్.. ఈ పోరు ఇరుదేశాల మహిళల క్రికెట్ జట్ల మధ్య ఉండనుంది. చైనా వేదికగా జరుగుతున్న 2023 ఆసియా క్రీడల్లో తొలిసారి క్రికెట్‌ను ఈ గేమ్స్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లీగ్, సెమీఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత మహిళల జట్టు.. ఫైనల్‌కు చేరింది. తద్వారా ఫైనల్స్‌కు చేరుకున్న మొదటి జట్టుగా నిలిచింది. ఇక మరో సెమీస్‌లో శ్రీలంక- పాకిస్థాన్‌తో తలపడ్డాయి. ఇందులోలో శ్రీలంక 6 వికెట్లతో నెగ్గి.. ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. దీంతో తుది పోరులో భారత్-శ్రీలంక మహిళల జట్లు తలపడనున్నాయి.
ఫైనల్స్‌కు ఇలా..ఈ ప్రతిష్ఠాత్మకమైన పోటీల్లో భారత్.. తొలి మ్యాచ్‌లో మలేసియా మహిళల జట్టుతో తలపడింది. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అయితే భారత్‌కు మెరుగైన ర్యాంకింగ్ ఉండటం వల్ల సెమీస్‌కు అర్హత సాధించింది.