Asian Games 2023 Cricket : సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు చైనాలోని హాంగ్జౌలో జరిగే ఆసియా క్రీడలకోసం భారత పురుషుల క్రికెట్ జట్టును ఇటీవల ప్రకటించింది బీసీసీఐ. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అదరగొట్టిన యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌ను భారత కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున అదరగొట్టిన రింకూ సింగ్ తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఈసారి జితేశ్ శర్మ, షాబాజ్ అహ్మద్, శివమ్ మావి లాంటి యువ ఆటగాళ్లకు అవకాశం దక్కింది. అయితే 2023 ఐపీఎల్ సీజన్లో రాణించిన మరి కొందరు యువఆటగాళ్లకు బీసీసీఐ మొండి చేయి చూపింది. మరి అవకాశం దక్కని వారేవరో చూసేద్దాం.
వరుణ్ చక్రవర్తి..
ఐపీఎల్‌లో కోల్‌కతా టీమ్ తరఫున ఆడాడు ఈ యువ ప్లేయర్. 2023 ఐపీఎల్ సీజన్లో వరుణ్బాగానే రాణించాడు. గతంలో కూడా టీమ్ఇండియాకు ఆడిన కారణంగా ఈ సారి జట్టులో వరుణ్‌కు చోటు పక్కా అని అనుకున్నారు. కానీ అనుహ్యంగా ఆసియా క్రీడలకు బీసీసీఐ సెలక్ట్ చేసిన జాబితాలో వరుణ్ పేరు లేదు.
రియాన్ పరాగ్..
ఈ యువ ఆటగాడు ఎప్పటినుంచో టీమ్ఇండియా పిలుపుకోసం ఎదురుచూస్తున్నాడు. 2019లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆడాడు. ఈ సీజన్లో పరాగ్ బ్యాటింగ్‌తో అంతలా ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఇండియా-A తరఫున పరాగ్‌కు ఫర్వాలేదనిపిస్తున్నాడు. అసోం తరఫున రంజీ మ్యాచుల్లో కూడా అదరగొడుతున్నా.. సెలెక్టర్లు రియాన్ వైపు మొగ్గు చూపలేదు.