Asian Batters Highest Individual Scores In WC : భారత్‌లో క్రికెట్‌కు ఉండే క్రేజ్ వేరు. ద్వైపాక్షిక సిరీస్‌ల నుంచి ప్రపంచకప్ దాకా అన్ని మ్యాచ్‌లను మిస్ అవ్వకుండా ఫాలో అయిపోతుంటారు క్రికెట్ ఫ్యాన్స్. మరో ఏడు వారాల్లో ప్రారంభమయ్యే ప్రపంచకప్ కోసం యావత్ క్రీడాలోకం ఎదురుచూస్తోంది. అయితే ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లతో పాటు.. ఆసియా ఖండపు దేశాలు భారత్, పాకిస్థాన్, శ్రీలంక కూడా విశ్వవిజేతలుగా నిలిచాయి. ఆయితే ఈ మెగా టోర్నీలో ఆసియా ఖండపు దేశాల బ్యాటర్లు సాధించిన టాప్-5 అత్యధిక వ్యక్తిగత స్కోర్లపై ఓ లుక్కేద్దాం..
Sourav Ganguly Highest World Cup Score : బంగాల్ టైగర్‌గా పిలిచే సౌరవ్ గంగూలీ.. వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. 1999 ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్‌లో 158 బంతులు ఎదుర్కొన్న గంగూలీ.. 17 ఫోర్లు, 7 సిక్సులు సహా 183 పరుగులు చేశాడు. అప్పటికి ఈ ఇన్నింగ్సే.. ప్రపంచకప్‌లో ఓ భారత ఆటగాడు సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఇదే మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్ సైతం 145 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా 157 పరుగులతో ఘన విజయం సాధించింది.
Kapil Dev Highest World Cup Score :ఇండియన్ లెజెండరీ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్.. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. భారత్ సాధించిన తొలి వరల్డ్‌కప్‌లోనే కపిల్ ఈ ఘనత సాధించాడు. 1983 టోర్నీలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో.. భారత్ 17/5 తో పీకల్లోతు కష్టాల్లో ఉండగా కపిల్ జట్టును ఆదుకున్నాడు. 175 పరుగుల భారీ ఇన్సింగ్స్‌తో జట్టుకు పోరాడగలిగే (266 పరుగులు) స్కోర్ అందించాడు. ఈ మ్యాచ్‌లో 16 ఫోర్లు, 6 సిక్సులు బాది జింబాబ్వే బౌలర్ల భరతం పట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా 31 రన్స్ తేడాతో విజయం సాధించింది.