Asia Cup Team India Players list 2023 : ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక పోటీలో పాల్గొనే భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. దిల్లీలో తాజాగా జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో ఈ జట్టును ఖారారు చేశారు. ఈ మీటింగ్‌లో టీమ్ఇండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ సహా పలువురు పాల్గొన్నారు.
ఈ మీటింగ్‌లో కమిటీ.. 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టోర్నిలో టీమ్ఇండియా జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వ బాధ్యతలు చేపట్టగా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గాయాలతో కోలుకుంటున్న కె.ఎల్.రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఈ టోర్నీతో పునరాగమనం చేస్తున్నారు. అలాగే ఇటీవలే ఐర్లాండ్ టీ20లో చెలరేగిపోయిన జస్ప్రీత్ బుమ్రా కూడా ఆసియా కప్‌లో టీమ్ఇండియా తరఫున ఆడనున్నాడు. హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మకు కూడా ఈ తుది జట్టులో చోటు దక్కడం విశేషం.
Asia Cup 2023 Schedule : ఇక ఈ ఏడాది ఆసియాకప్‌కు శ్రీలంక, పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. మ్యాచ్‌లన్నీ హైబ్రిడ్ మోడల్‌లలో జరగనుంది. ఆగస్టు 30న ముల్తాన్ వేదికగా పాకిస్థాన్ -నేపాల్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ టోర్నీ ఆరంభం కానుంది. ఇక భారత్ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 4న నేపాల్‌తో తలపడనుంది. రెండు మ్యాచ్‌లు శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరగనున్నాయి. సూపర్ -4 మ్యాచ్‌లు సెప్టెంబర్ 6 నుంచి మొదలుకాన్నాయి. ఈసారి వన్డే ఫార్మాట్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం కానున్నాయి.