Asia Cup 2023 Super 4 Reserve Day :2023 ఆసియా కప్సూపర్ 4లో భాగంగా సెప్టెంబర్ 10న జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు రిజర్వ్ డే కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఒక్క ఇండోపాక్ మ్యాచ్‌కే రిజర్వ్ డే కేటాయించడం పట్ల.. నెటిజన్ల నుంచి ఆసియా క్రికెట్ బోర్డు తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది. ప్రతిష్ఠాత్మకమైన టోర్నమెంట్లో ఇలాంటి వివక్ష చూపడం సరికాదంటూ.. క్రికెట్ ప్రియులు సోషల్ మీడియాలో అంసతృప్తి వ్యక్తపరుస్తున్నారు.
టోర్నీలో సూపర్ 4కు భారత్, పాకిస్థాన్సహా.. బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు కూడా అర్హత సాధించాయి. ఈ మ్యాచ్‌లు జరిగే కొలొంబో నగరంలో కురుస్తున్న వర్షాలు.. బంగ్లా, శ్రీలంక మ్యాచ్‌లకూ ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఒక వేళ వీరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే ఇరు జట్లు చెరో పాయింట్‌తో సరిపెట్టుకోవాలి. దీంతో వారికి ఫైనల్ చేరే అవకాశాలు సన్నగిల్లుతాయి.
అందుకే ఇరుజట్ల కోచ్‌లు తమ మ్యాచ్‌కు సైతం రిజర్వ్ డే ఉండాలని కోరుతున్నారు. "మాతో చర్చించకుండా కేవలం ఒక మ్యాచ్ కోసం అలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి" అని ఇరు జట్ల కోచ్‌లు ప్రశ్నించారు. అయితే ఈ వివాదంపై బంగ్లా, శ్రీలంక క్రికెట్ బోర్డులు స్పందించాయి. సూపర్ 4 పోటీలో ఉన్న 4 జట్ల బోర్డులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుందని ఇరు దేశాల బోర్డులు స్పష్టం చేశాయి.