Asia Cup Super 4 : ఆసియా కప్‌లో భాగంగా జరగనున్న ఆసక్తికరమైన పోరుకు రోహిత్ సేన సిద్ధమైంది. ఆదివారం జరగనున్న సూపర్ 4 పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మరోసారి పోటీపడేందుకు రంగంలోకి దిగనుంది. ఇదివరికే ఈ రెండు జట్ల మధ్య జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లు పై చేయి సాధించారు. ఇక భారత టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. అయితే ఆ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా సమష్టి కృషి వల్ల భారత్ చెప్పుకోదగ్గ స్కోర్ చేయగలిగింది. భారత ఇన్నింగ్స్ తర్వాత వర్షం రావడం వల్ల మ్యాచ్ మళ్లీ మొదలు కాలేదు. ఎంతకీ వాన తగ్గకపోవడం వల్ల మ్యాచ్‌ను రద్దు చేయలంటూ అంపైర్లు నిర్ణయానికి వచ్చారు . దీంతో ఫలితం తేలకుండానే ఆ మ్యాచ్ ముగిసింది.
మరోవైపు సెప్టెంబర్ 10న భారత్-పాకిస్థాన్ మరోసారి తలపడనున్నాయి. అయితే గత మ్యాచ్ అనుభవంతో రోహిత్ సేన ఈ సారి గట్టి ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తుది జట్టులో కీలక మార్పులు చేయనుంది. గత మ్యాచ్‌లో బరిలోకి దిగని మహ్మద్ షమీ .. ఆదివారం జరిగే మ్యాచ్ కోసం తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది . ఇక బుమ్రా, సిరాజ్, షమీలతో రోహిత్ పాకిస్థాన్ జట్టు చిత్తు చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇక ఆల్‌రౌండర్ హార్దిక్ ఉన్నందున కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. ఇక నేపాల్‌తో జరిగిన పోరులో ఆశించిన స్థాయిలో రాణించని భారత పేసర్లు రానున్న పోరులో తమ సత్తా చాటేందుకు కసరత్తులు చేస్తున్నారు. జడేజా, కుల్దీప్ యాదవ్ తమ వ్యూహాలతో పాక్ సేనను మట్టి కరిపించేందుకు రెడీగా ఉన్నారు.
Ind Vs Pak Super 4 : ఇటీవలే బుమ్రా తండ్రైన సంగతి తెలిసిందే. దీంతో అతను హుటాహుటిన భారత్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో గత సోమవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అయితే ఆదివారం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులో ఉండనున్నాడు. దీంతో శార్దుల్ ఠాకూర్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. మరోవైపు ఫిట్నెస్ నిరూపించుకున్న కేఎల్ రాహుల్ తుది జట్టులో ఆడే విషయంపై సందిగ్ధత నెలకుంది. దీంతో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లలో ఒక్కరు మాత్రమే పాకిస్థాన్ తో జరిగే పోరులో తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. పరిస్థితులను బట్టి చూస్తే కేఎల్ రాహుల్ బెంచ్ కే పరిమితం అయ్యే అవకాశం ఉంది.