Asia Cup 2022: శ్రీలంకలో నెలకొన్న పరిస్థితుల అక్కడ ఆసియా కప్ నిర్వహిస్తారా లేదా అన్న సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. టోర్నీ వేదికను మార్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా దీనిపై స్పష్టతనిచ్చాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. టోర్నీని యూఏఈకి తరలించనున్నట్లు స్పష్టం చేశాడు.
చేతులెత్తేసిన శ్రీలంక.. ఆసియా కప్ వేదిక ఎక్కడంటే.. - యూఏఈలో ఆసియా కప్
Asia Cup 2022: శ్రీలంక వేదికగా జరగాల్సిన ఆసియా కప్‌ను యూఏఈకి మార్చారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పష్టం చేశాడు.
ఆసియా కప్
అక్కడ దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆసియా కప్‌ను నిర్వహించలేమని, శ్రీలంక బోర్డు చేతులెత్తేయడంతో ప్రత్యామ్నాయ వేదికను చూడక తప్పలేదని అన్నాడు దాదా. ఆసియా కప్ జరిగే సీజన్‌లో ఉండే వాతావరణ పరిస్థితిని చూస్తే ఒక్క యూఏఈలోనే వర్షాలు పడే అవకాశం లేదు కాబట్టి దానినే ఖాయం చేశామని గంగూలీ స్పష్టం చేశాడు. కాగా, ఆగస్టు 27నుంచి సెప్టెంబర్ 11 వరకు ఈ టోర్నీ జరగనుంది.
ఇదీ చూడండి: కోహ్లీ, రోహిత్, ధోనీ రికార్డ్స్‌పై కన్నేసిన ధావన్!