తెలంగాణ

telangana

ETV Bharat / sports

కరోనా ఎఫెక్ట్​- ఆసియా కప్​ రద్దు

By

Published : May 19, 2021, 7:42 PM IST

Updated : May 19, 2021, 8:06 PM IST

Asia Cup called off due to rising COVID-19 cases in Sri Lanka: SLC CEO
కరోనా కారణంగా ఆసియా కప్​ రద్దు

19:37 May 19

ఆసియా కప్​ రద్దు

శ్రీలంక వేదికగా జూన్​లో జరగాల్సిన ఆసియా కప్​ను రద్దు చేస్తున్నట్లు లంక క్రికెట్ బోర్డు సీఈఓ యాష్లే డిసిల్వా వెల్లడించారు. శ్రీలంకలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టోర్నీ నిర్వహణ కష్టమని ఆయన పేర్కొన్నారు.  

"కొవిడ్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆసియా కప్​ నిర్వహించడం కష్టం. అందుకే జూన్​లో జరగాల్సిన ఈ టోర్నీని రద్దు చేస్తున్నాం," అని డిసిల్వా తెలిపారు.  

నిజానికి పాకిస్థాన్​లో జరగాల్సిన ఈ ఆసియా కప్​ వేదికను శ్రీలంకకు తరలించారు. భారత్​-పాక్​ మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్ల టీమ్​ఇండియా ఆటగాళ్లు పాక్​లో పర్యటించడానికి సుముఖుత వ్యక్తం చేయకపోవడం ఇందుకు కారణం. దీంతో టోర్నీ వేదికను మార్చారు నిర్వాహకులు. 

చివరగా ఆసియా కప్​ 2018లో జరిగింది.  

దీనిపై జై షా నేతృత్వంలోని ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఆసియా కప్​లో పాల్గొనాల్సిన అన్ని జట్లు తమ క్రికెట్ క్యాలెండర్​ను రెండేళ్లకు నిర్ణయించాయి. దీంతో, 2023 ప్రపంచకప్ తర్వాత మాత్రమే ఆసియా కప్​ను నిర్వహించడానికి అవకాశం ఉంటుంది.  

ఇదీ చదవండి:'అందుకే డివిలియర్స్​ జట్టులోకి రావట్లేదు'

Last Updated : May 19, 2021, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details