2023 ఆసియా కప్ క్రికెట్ టోర్నీని (Asia Cup 2023) తమ దేశంలో నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ రమీజ్ రజా చెప్పారు. ఇటీవల బీసీసీఐ కార్యదర్శి జై షా అధ్యక్షతన జరిగిన ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం (Asia Cup 2023 Host) తీసుకున్నారు. వన్డే ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరగనుంది.
నిజానికి గతేడాది పాక్‌లో ఆసియా కప్ (Asia Cup) జరగాల్సింది. కానీ భద్రతా కారణాల రీత్యా టోర్నీని యూఏఈకి తరలించాలని బీసీసీఐ కోరింది. మధ్యలో కరోనా మహమ్మారి కారణంగా మొదట 2021కి ఆ తర్వాత 2022కి ఈ టోర్నీ వాయిదా పడింది. మొత్తానికి వచ్చే ఏడాది శ్రీలంకలో ఈ టోర్నీని టీ20 ఫార్మాట్‌లో జరపాలని నిర్ణయించారు.
2023 ఆసియా కప్ ఆతిథ్యం విషయంలో మాత్రం పాక్ పట్టు వదలట్లేదు. భారత్‌లో 2023లో జరిగే వన్డే ప్రపంచకప్‌నకు (World Cup 2023 Host) సన్నాహకంగా ఈ ఆసియా కప్ నిర్వహించే అవకాశం ఉంది.