AsiaCup 2023 Kohli Centuries : ఆసియా కప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అతడు.. లంక మ్యాచ్‌లో 12 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులే చేసి విఫలమయ్యాడు.
లంక యంగ్ స్పిన్నర్, లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ దునిత్ వెల్లలగే బౌలింగ్‌లో సింగిల్ డిజిట్ స్కోరుకే ఔట్ అయ్యాడు. అతడు సంధించిన బంతిని తప్పుగా అంచనా వేసి మూల్యం చెల్లించుకున్నాడు. దసున్ శనకకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో.. 'నిన్న సెంచరీ.. ఈరోజేమో ఇలా', 'ఏంటి కోహ్లీ.. ఇలాగేనా ఆడేది?', '20 ఏళ్ల యంగ్ బౌలర్ చేతిలో ఔట్ అవ్వడం నీ స్థాయికి తగదు' అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
ఇప్పటికీ ఎనిమిది సార్లు.. 2021 నుంచి ఇప్పటి వరకు లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలింగ్‌లో కోహ్లీ 159 బంతులు ఎదుర్కొన్నాడు. అందులో 13 సగటుతో 104 పరుగులు చేశాడు. ఎనిమిదిసార్లు పెవిలియన్ బాట పట్టాడు. అలా ఇప్పుడు శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ లెఫ్టార్మ్ స్సిన్నర్లను ఎదుర్కోవడంలో కోహ్లీకి ఉన్న బలహీనత మరోసారి రుజువైంది.