తెలంగాణ

telangana

ETV Bharat / sports

2023 ఆసియా కప్​ షెడ్యూల్​ ఫిక్స్​.. ఒకే గ్రూప్​లో భారత్​, పాక్.. ఇక రచ్చరచ్చే! - ఆసియా కప్​ 2023 అప్డేట్స్

2023లో జరగనున్న ఆసియా కప్‌ను షెడ్యూల్​ రానే వచ్చింది. ఈ ఏడాది ఆసియా కప్​లో ఇండియా-పాకిస్థాన్​ ఒకే గ్రూప్​లో ఉన్నాయని బీసీసీఐ కార్యదర్శి జై షా ఖాయం చేశాడు. మరోసారి దాయాది జట్లు తలపడునున్నాయి.

asia cup 2023
asia cup 2023

By

Published : Jan 5, 2023, 2:27 PM IST

2023 Asia Cup Schedule: దాయాదుల మధ్య సమరం ఎందుకు అంత రసవత్తరంగా ఉంటుందో చెప్పడానికి ప్రత్యేకించి పరిచయాలు అక్కర్లేదు. గతేడాది ముగిసిన టీ20 ప్రపంచకప్​లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా ముగిసిన మ్యాచ్ ఇరు దేశాల మధ్య మ్యాచ్​లకు ఉండే క్రేజ్​కు సజీవ సాక్ష్యం. ఈ మెగా పోరు తర్వాత మళ్లీ భారత్-పాక్ లు ఎప్పుడు తలపడతాయి..? అన్న ప్రశ్నకు బీసీసీఐ కార్యదర్శి జై షా సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ ఏడాది ఆసియా కప్​లో ఇండియా-పాకిస్థాన్​ ఒకే గ్రూప్​లో ఉన్నాయని ఆయన ఖాయం చేశాడు.

ఆసియా కప్-2023 (వన్డే ఫార్మాట్)లో భాగంగా ఈ రెండు జట్లూ తలపడనున్నాయి. సెప్టెంబర్​లో జరగాల్సి ఉన్న ఈ మెగా టోర్నీలో భారత్​, పాక్​ ఒకే గ్రూప్​లో ఉన్నాయి. గతేడాది మాదిరిగానే ఆరు జట్లతో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. భారత్, పాక్​తో పాటు క్వాలిఫయిర్ ఓ గ్రూప్​లో ఉండగా శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్​లు మరో గ్రూప్​లో ఉన్నాయి.

ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న జై షా ట్విట్టర్​ ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. 2023, 2024 సంవత్సరాలకు గాను ఏసీసీ నిర్వహించబోయే షెడ్యూల్ వివరాలను ట్విట్టర్​లో షేర్​ చేశారు. ఈ సందర్భంగా షా తన ట్వీట్​లో.. '2023, 2024 సంవత్సరాలకు గాను ఏసీసీ క్రికెట్ క్యాలెండర్​ను మీకు పరిచయం చేస్తున్నా. ఆటను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు గాను మా అసమానమైన ప్రయత్నాలను ఇది సూచిస్తుంది...'అని పేర్కొన్నాడు. 2023తో పాటు 2024లో జరగబోయే ఆసియా కప్ (టీ20 ఫార్మాట్)లో కూడా భారత్, పాక్​లు ఒకే గ్రూప్ లో ఉండటం గమనార్హం. కానీ అప్పుడు ఈ టోర్నీలో 8 దేశాలు పాల్గొననున్నాయి.

వేదికపై రాని స్పష్టత..
ఏసీసీ రెండేళ్ల షెడ్యూల్ విడుదల చేసిన జై షా మరి ఈ ఏడాది ఆసియా కప్ ఎక్కడ నిర్వహిస్తారనేది మాత్రం ప్రస్తావించలేదు. ట్వీట్​లో ఆయన షేర్ చేసిన సమాచారంలో కూడా లేదు. వాస్తవానికి ఈ ఏడాది ఆసియా కప్​కు పాక్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే పాక్​లో ఈ టోర్నీ జరిగితే భారత్​ రాదని ఇప్పటికే జై షా ప్రకటన చేశారు. పాక్​కు వచ్చే ప్రసక్తే లేదని, తటస్థ వేదికపై అయితేనే ఆసియా కప్ ఆడతామన్న బీసీసీఐ.. మరి ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details