Asia Cup 2023 Team India Bowling :2023 ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో టీమ్ఇండియాబౌలింగ్ గురించి ఇప్పటికే అనేక సార్లు చర్చ జరిగింది. మెగా టోర్నమెంట్లో ఆయా జట్ల మేటి బ్యాటర్లకు.. భారత బౌలర్లు ఎలా కళ్లెం వేస్తారన్నది అందోళనకరంగా మారింది. అయితే భారత బౌలింగ్ దళం ప్రస్తుత ఆసియా కప్‌లో అదరగొడుతోంది. ఈ టోర్నీలో భారత్.. ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 సార్లు ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేసింది. దీంతో భారత్ బౌలింగ్ మెరుగుపడిందని టీమ్ఇండియా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న ప్రపంచ కప్‌లోనూ ఇదే జోరు ప్రదర్శించాలని ఆశిస్తున్నారు. మరి ఈ మూడు మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా బౌలర్ల ప్రదర్శనపై ఓ లుక్కేద్దాం..
భారత్ వర్సెస్ నేపాల్ (230/10).. టోర్నీలో భారత్ తమ రెండో మ్యాచ్లోనేపాల్ను ఢీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక పసికూన నేపాల్.. ఇన్నింగ్స్‌ను ఘనంగానే ఆరంభించినా.. ఆ తర్వాత లయ కోల్పోయింది. పేసర్ మహమ్మద్ సిరాజ్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ధాటికి నేపాల్ నేపాల్.. క్రమంగా వికెట్లు కోల్పోయింది. ఇక నేపాల్ 48.1 ఓవర్లలో 230 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో జడేజా 3, సిరాజ్ 3, షమీ, హార్దిక్ పాండ్య, శార్దుల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు.
భారత్ వర్సెస్ పాకిస్థాన్ (128/10)..పాక్‌తో తొలి మ్యాచ్‌లో భారత్‌కు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. దీంతో టీమ్ఇండియా ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఆ లోటును సూపర్ 4లో సోమవారం జరిగిన మ్యాచ్‌తో భర్తీ చేశారు భారత బౌలర్లు. 357 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో.. టీమ్ఇండియా బౌలర్ల ధాటికి పాక్.. విలవిల్లాడింది. స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను ఓ ఆట ఆడేసుకున్నాడు. ఓపెనర్ ఫకప్ జమాన్ సహా.. 5 వికెట్లతో అదరగొట్టాడు. ఫలితంగా పాక్ ఇన్నింగ్స్ 32 ఓవర్లలో 128 పరుగులకు కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో భారత్ 228 పరుగుల తేడాతో గెలుపొందింది.