Asia Cup 2023 Sl vs Ban :2023 ఆసియా కప్ సూపర్-4లో భాగంగా శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో.. శ్రీలంక 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 9 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. అనంతరం 258 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా.. 48.1 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌట్ అయ్యింది. లంక బౌలర్లలో మహీషా పతిరన , శనాక , తీక్షణ మూడేసి వికెట్లు పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించారు. అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న సమరవిక్రమ (93 పరుగులు; 72 బంతుల్లో 8x4, 2x6) కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఇక సూపర్ 4లో పాకిస్థాన్‌తో తొలిమ్యాచ్‌లో భంగపడ్డ బంగ్లా.. ఈ ఓటమితో బంగ్లా దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే.
ఛేదనలో బంగ్లా తడబాటు.. టార్గెట్ పెద్దదేమీ కాదు. ఛేదనను బంగ్లా అద్భుతంగా ఆరంభించింది. 11 ఓవర్లకు బంగ్లా 55/0తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. కానీ ఆ తర్వాతే మొదలైంది బంగ్లాదేశ్ పతనం. లంక బౌలర్ శనాక తన వరుస ఓవర్లలో.. ఓపెనర్లు మెహిదీ హసన్ మిరాజ్ (28), మహమ్మద్ నయిమ్ (21)ను పెవిలియన్ చేర్చి బంగ్లాకు షాక్ ఇచ్చాడు.
ఆ తర్వాత కొద్దిసేపటికే కెప్టెన్ షకీబ్ అల్ హసన్(3) వెనుదిరిగాడు. ఇక బంగ్లా 18.5 ఓవర్లకు 83/4 తో కష్టాల్లో పడింది.ఆ తర్వాత హృదాయ్ (82 పరుగులు; 97 బంతుల్లో 7x4, 1x6) హాఫ్ సెంచరీతో రాణించి.. బంగ్లా శిబిరంలో ఆశలు రేపాడు. కానీ అతడికి సహకారం అందించేవారు కరవయ్యారు. చివర్లో టపాటపా వికెట్లు పారేసుకున్న బంగ్లా.. 236 పరుగులకు ఆలౌటైంది.