Asia Cup 2023 Schedule : ఆసియా కప్ 2023 షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు జై షా బుధవారం ప్రకటించారు. ఈ టోర్నీలో సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు శ్రీలంక క్యాండీ వేదికకానుంది. ఆగస్టు 30న పాకిస్థాన్ - నేపాల్ మ్యాచ్‌తో ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఇక టోర్నీలో పాల్గొనే ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. కాగా ఆరు జట్ల మధ్య మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. సెప్టెంబరు 17వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీకి తెరపడనుంది.
Asia Cup 2023 Schedule : ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది.. పాక్‌తో భారత్ పోరు అప్పుడే..
Asia Cup 2023 Schedule : ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబరు 2న భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో శ్రీలంకలోని క్యాండీలో తలపడనుంది. ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ ప్రారంభమవ్వగా.. సెప్టెంబరు 17న ఫైనల్ జరగనుంది.
Asia Cup 2023 ind vs pak :అయితే భారత్, పాకిస్థాన్, నేపాల్ జట్లు గ్రూప్ -ఏ కాగా.. బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్‌లు గ్రూప్ - బీలో ఉన్నాయి. గ్రూప్ స్టేజ్‌లో మొత్తం ఆరు మ్యాచ్‌లు జరగనున్నాయి. రెండు గ్రూప్‌ల్లో టాప్ 2 జట్లు.. సూపర్ 4 మ్యాచ్‌లు ఆడతాయి. గ్రూప్-ఏలో టాప్‌లో ఉన్న జట్టు, గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో సెప్టెంబరు 6న సూపర్-4లో తొలి మ్యాచ్ ఆడుతుంది. సెప్టెంబరు 15న సూపర్-4 చివరి మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాప్ - 2లో నిలిచిన జట్లు కొలంబొలో జరిగే ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధిస్తాయి.
Asia Cup 2023 Venue : కాగా ఈ టోర్నమెంట్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం వహించినప్పటికీ.. టీమ్ఇండియా పాక్ పర్యటనకు వెళ్లేందుకు నిరాకరించింది. అందువల్ల ఈ టోర్నీ.. హైబ్రిడ్ మోడల్‌లో జరగనుంది. ఈ విధంగా పాక్‌లోని ముల్తాన్‌లో ఒక మ్యాచ్.. లాహోర్‌లో మరో మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. మిగిలిన తొమ్మిది మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి. అందులో మూడింటికి క్యాండీ ఆతిథ్యమివ్వగా.. మరో ఆరు మ్యాచ్‌లకు కొలంబో వేదిక కానుంది. గతేడాది టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నమెంట్ ఈసారి వన్డే ఫార్మాట్లో జరగనుంది. అక్టోబరులో జరగబోయే వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని ఈసారి టోర్నమెంట్‌ను వన్డే ఫార్మాట్లో జరపనున్నారు.