తెలంగాణ

telangana

ETV Bharat / sports

Asia Cup 2023 : ఆ రెండు దేశాల్లో ఆసియా కప్‌.. భారత్​- పాక్​ మ్యాచ్ లంకలో.. - ఆసియా కప్​ 2023 లంక

Asia Cup 2023 Schedule : ఆసియా కప్‌-2023 షెడ్యూల్‌ ఖరారైంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 17 వరకు మ్యాచ్‌లు నిర్వహిస్తామని ఏషియన్‌ క్రికెట్ కౌన్సిల్‌ ప్రకటించింది. ఆ పూర్తి వివరాలు మీకోసం..

asia cup 2023 schedule announced
asia cup 2023 schedule announced

By

Published : Jun 15, 2023, 4:57 PM IST

Updated : Jun 15, 2023, 5:20 PM IST

Asia Cup 2023 Schedule : ఎట్టకేలకు ఆసియా కప్‌ సంబరం సిద్ధమవుతోంది. రెండు దేశాల్లోని వేదికల్లో ఆగస్ట్‌ 31 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు జరుగుతుందని ఏషియన్‌ క్రికెట్‌ కౌన్సిల్ ప్రకటించింది. భారత్, పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, నేపాల్‌తో కూడిన టోర్నీ 18 రోజులపాటు జరగనుంది. వన్డే ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్‌లో 13 మ్యాచ్‌లు ఉంటాయి.

పాక్​లో నాలుగు.. లంకలో తొమ్మిది..
అయితే హైబ్రిడ్‌ మోడల్‌లో టోర్నీ జరుగుతుందని ఏసీసీ వెల్లడించింది. పాకిస్థాన్‌లో నాలుగు మ్యాచ్‌లు, మిగిలిన 9 మ్యాచ్‌లు శ్రీలంక వేదికగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఏసీసీ ప్రతినిధులు తెలిపారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌ టోర్నీకి అతిథ్యమిచ్చే అవకాశం పాకిస్థాన్‌కు రావడం గమనార్హం. దీంతో మరోసారి భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ను వీక్షించే అవకాశం అభిమానులకు రానుంది. అయితే శ్రీలంక వేదికగానే ఇరు జట్ల మ్యాచ్‌ జరగనుంది.

బీసీసీఐ X పీసీబీ.. రంగంలోకి ఐసీసీ
Asia Cup 2023 : భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI), పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) మధ్య మాటల యుద్ధం సాగడంతో ఆసియా కప్‌ నిర్వహణపై తొలుత సందిగ్ధత నెలకొంది. పాకిస్థాన్‌కు తమ జట్టును పంపించేందుకు బీసీసీఐ నిరాకరించడం.. తమ టీమ్‌ కూడా భారత్‌ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనేది లేదని పీసీబీ పేర్కొంది. ఈ క్రమంలోనే తమ దేశంలో కొన్ని, తటస్థ వేదికల్లో కొన్ని మ్యాచ్‌లు నిర్వహించేలా హైబ్రిడ్‌ మోడల్‌ను పాక్‌ ప్రతిపాదించింది.

బీసీసీఐ సహా శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ అందుకు అంగీకరించకపోవడంతో పీఠముడి పడింది. దీంతో ప్రపంచకప్‌లో ఆడేది లేదని పాక్‌ తేల్చి చెప్పింది. ఈ క్రమంలో దాయాదుల పోరు లేకుండా ప్రపంచకప్‌ జరిగితే టోర్నీకి ఆకర్షణ తగ్గుతుందని భావించిన ఐసీసీ రంగంలోకి దిగింది. ఎలాంటి షరతులు లేకుండా పాక్‌ను ఒప్పించింది. అదే క్రమంలో పాక్‌ ప్రతిపాదించిన హైబ్రిడ్‌ మోడల్‌ను ఏసీసీ కూడా అంగీకరించడంతో ఆసియా కప్‌ నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. భారత్‌ ఆడే మ్యాచ్‌లతోపాటు సూపర్‌ - 4 పోరు శ్రీలంకలో జరుగుతుంది. ఇంకా వేదికలను ఖరారు చేయాల్సి ఉంది.

విండీస్​ పర్యటనకు టీమ్​ఇండియా
India Vs West Indies Tour 2023 : వరుసగా రెండోసారి ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​ షిప్​లో ఓటమిపాలైన భారత క్రికెట్​ జట్టు.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. వచ్చే నెలలో వెస్టిండీస్​ పర్యటనకు వెళ్లనుంది. అందులో భాగంగా టీమ్​ఇండియా.. ఆతిథ్య జట్టు విండీస్​తో రెండు టెస్ట్​లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఇటీవలే విండీస్​ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్​ను ప్రకటించిన బీసీసీఐ.. వచ్చే వారంలో భారత జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Last Updated : Jun 15, 2023, 5:20 PM IST

ABOUT THE AUTHOR

...view details