Asia Cup 2023 IND VS PAK :వరల్డ్‌కప్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఆసియా కప్ ఒకటి. ఆసియా ఖండంలోని ఆరు జట్లు ఆడుతున్నాయి. ఈ కప్ మొదలై మూడు రోజులైనా చప్పుడే లేదు. రెండు మ్యాచ్‌లు పూర్తైనా ఎలాంటి చర్చా కనపడట్లేదు. కానీ ఇంకొన్ని గంటల్లో అంతా మారిపోతుంది. ఎందుకంటే జరగబోయేది భారత్-పాకిస్థాన్ మ్యాచ్. ఆసియా వాసులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోతారు. క్రికెట్ మ్యాచ్‌లా కాకుండా ఓ యుద్ధంలా భావిస్తారు ఫ్యాన్స్. అయితే మరి కొన్ని గంటల్లో భారత్-పాక్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలుపై ఓ లుక్కేద్దాం..
- భారత్ బ్యాటింగ్ లైనప్.. ఆ ముగ్గురు పాక్ బౌలర్లు డేంజర్.. ఈ టోర్నీలో పాక్ ఇప్పటికే నేపాల్‌ను ఓడించి ఘనంగా ఆరంభించగా.. భారత్ నేడు జరగబోయే మ్యాచ్‌తోనే తన పోరాటాన్ని మొదలుపెట్టనుంది.
- ఎప్పుడూ బలంగా ఉండే పాక్ బౌలింగ్.. ఈసారి మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది. గాయం నుంచి కోలుకుని పునరాగమనంలో నిలకడగా రాణిస్తున్న ఫాస్ట్‌బౌలర్ షహీన్ అఫ్రిదితో ప్రమాదం పొంచి ఉంది. 2021 టీ20 వరల్డ్ కప్‌లో అతడు కొట్టిన దెబ్బను మర్చిపోవడం అంత ఈజీ కాదు. అతడితో చాలా జాగ్రత్తగా ఉండాలి.
- ఇక వరల్డ్‌లోనే అత్యంత వేగవంతమైన పేసర్ అయిన హారిస్ రవూఫ్, యువ పేసర్ నసీమ్ షాలను తేలిగ్గా తీసుకోలేం. మధ్య ఓవర్లలో స్పిన్ త్రయం షాదాబ్, నవాజ్, అఘా సల్మాన్‌లను పాక్ ప్రయోగించబోతోంది.
- ఓపెనర్లు రోహిత్, శుభ్‌మన్.. ఆ తర్వాత కోహ్లీ ఈ త్రయాన్ని ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది. 2019 వన్డే వరల్డ్ కప్‌లో పాక్‌పై మెరుపు సెంచరీ బాదిన హిట్ మ్యాన్.. ఇప్పుడు కెప్టెన్‌గా అలాంటి ఇన్నింగ్స్‌తో ఆడాతాడా లేదో చూడాలి.
- ఇక పాకిస్థాన్‌తో మ్యాచ్ అనగానే మొదటి అందరి ఫోకస్ కోహ్లీ మీదే. ఎందుకంటే పాక్‌పై అతడికి మంచి రికార్డుంది. పాక్‌పై 13 వన్డేల్లో 48.72 యావరేజ్‌తో 2 శతకాలు, 2 అర్ధ శతకాలు సహా 536 పరుగులు చేశాడు. టీ20ల్లో 10 మ్యాచ్‌లాడి 81.33 యావరేజ్‌తో 488 రన్స్ చేశాడు. గత ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో అసాధారణంగా పోరాడి జట్టును గెలిపించాడు. ఇదే కొనసాగించాలని ఆశిద్దాం..
- మొదటి సారి పాక్‌తో తలపడనున్న శుభ్‌మన్, గాయం తర్వాత పునరాగమనం చేసిన శ్రేయస్ అయ్యర్ ఎలాంటి ప్రదర్శన చేస్తారో. మిడిలార్డర్లో హార్దిక్, చివర్లో జడేజా మెరుపులు అవసరం.
- భారత్ బౌలింగ్... ఆ ఇద్దరు పాక్ బ్యాటర్లతో ప్రమాదం.. గాయం తర్వాత ఫిట్నెస్ సాధించి ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన ప్రధాన పేసర్ బుమ్రా.. ఇప్పుడు వన్డే మ్యాచ్‌ల్లో ఎలా బౌలింగ్ చేస్తాడన్నది ఆసక్తికరం. ఈ ఆసియా కప్‌లో సత్తా చాటితే త్వరలోనే జరగబయే వరల్డ్పక్కు మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
- ఇక బుమ్రా లేనప్పుడు ప్రధాన బౌలర్‌గా వ్యవహరించిన సిరాజ్‌పైనా కూడా మంచి అంచనాలున్నాయి. శార్దూల్ నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ షమినే మూడో పేసర్‌గా తుది జట్టులో తీసుకోవచ్చు.
- స్పిన్‌లో జడేజా, కుల్దీప్పైనే ఆశలు ఉన్నాయి.
- మరి ఫుల్ ఫామ్‌లో ఉన్న పాక్ కెప్టెన్ బాబర్ అజామ్, రిజ్వాన్, ఇమాముల్ హక్, ఇఫ్తికార్ అహ్మద్‌లను.. భారత బౌలర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ముఖ్యంగా అజామ్, రిజ్వాన్‌ల నుంచి బౌలర్లకు ఎక్కువ ముప్పు పొంచి ఉంది.
Asia Cup 2023 Babar Azam : బాబర్ ఆజమ్ సంచలనం.. కోహ్లీ అందుకున్న రెండు వరల్డ్ రికార్డ్స్ బ్రేక్!