Asiacup 2023 IND VS Nepal :ఆసియా కప్ 2023లో భాగంగా నేడు(సెప్టెంబర్ 4) జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్ఇండియా ఫీల్డర్లు పేలవ ప్రదర్శన చేశారు. దీంతో ఈ అవకాశాన్ని నేపాల్ ఓపెనర్లు వినియోగించుకుంటూ మంచి స్కోర్ చేశారు. ఓపెనర్లు కుశాల్ భుర్తాల్(38), ఆసిఫ్ షేక్(58) మంచి స్కోర్లను అందుకుని జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు. అయితే ఈ క్రమంలోనే టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ కోహ్లీ మాత్రం రెండు సూపర్ క్యాచ్‌లు పట్టారు.
Asiacup 2023 IND VS Nepal Kohli Catch : టీమ్ఇండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో రికార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆసిఫ్ షేక్ క్యాచ్ పట్టడంతో విరాట్ మల్టీ నేషనల్ వన్డే టోర్నమెంట్లలో 100 క్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. భారత మాజీ సారథి మొహ్మద్ అజహారుద్దీన్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో నాన్ వికెట్‌కీపర్‌గా రికార్డుకెక్కాడు. నేపాల్ ఇన్నింగ్స్ 30వ ఓవర్‌లో మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో కోహ్లీ ఈ క్యాచ్‌ను పట్టుకున్నాడు. బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తాకి గాల్లోకి ఎగరగా విరాట్ ఒంటి చేత్తో ఆ క్యాచ్‌ను అందుకున్నాడు. అంతకుముందు కోహ్లీ ఓసారి ఆసిఫ్ షేక్ బాదిన సునాయాస క్యాచ్‌ను జారవిడిచాడు. ఫైనల్‌గా హాఫ్ సెంచరీ సాధించి క్రీజులో పాతుకుపోయిన ఆసిఫ్ (58; 8 ఫోర్లు) వికెట్ దక్కడంతో టీమ్ఇండియా బ్రేక్ లభించినట్టైంది.
Asiacup 2023 IND VS Nepal Rohith Catch : ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అందుకున్న క్యాచ్ కూడా హైలైట్‌గా నిలిచింది. నేపాల్ ఇన్నింగ్స్ 20వ ఓవర్లో.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ రోహిత్ పౌడేల్ బంతిని కాస్త తప్పుగా అంచనా వేశాడు. బ్యాక్‌ఫుట్ షాట్ ఆడబోయి ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హిట్ మ్యాన్ వైపు బాదాడు. దీంతో ఈ సింపుల్ క్యాచ్‌ను హిట్ మ్యాన్ రోహిత్ పట్టేసి.. సంబరాలు చేసుకున్నాడు. దీంతో ఇక నేపాల్ కెప్టెన్ రోహిత్(5) నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే ఇక్కడ రోహిత్ రియాక్షన్ బాగా ట్రెండ్ అయింది. ఈ రెండు క్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు వీటిని తెగ షేర్ చేస్తున్నారు.