Asia Cup 2023 India VS Nepal : ఆసియా కప్‌లో భాగంగా మరికాసేపట్లో పల్లెకెలె వేదికగా భారత్, నేపాల్ తలపడనున్నాయి.టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా, టీమ్‌ఇండియా- నేపాల్ మధ్య ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం.
ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. "బౌలింగ్ ఎంచుకోవడానికి ప్రత్యేక కారణమంటూ ఏమీ లేదు. గత మ్యాచ్‌లో మంచి స్కోరు సాధించేందుకు మేము పోరాడాల్సి వచ్చింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్.. అద్బుతంగా రాణించారు. ఈ సారి బౌలర్లకు ఛాన్స్ ఇవ్వాలని భావించాం" అని అన్నాడు
నేపాల్‌తో మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. "వాతావరణం ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలీదు. బుమ్రా ఈ రోజు అందుబాటులో లేడు. కాబట్టి షమీ అతడి స్థానంలో బరిలోకి దిగుతాడు" అని రోహిత్ శర్మ తెలిపాడు. నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడేల్ ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు పేర్కొన్నాడు. ఆరిఫ్ షేక్ స్థానంలో భీమ్ షర్కీని తుది జట్టులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాడు.
నేపాల్ తుది జట్టు :రోహిత్ పౌడెల్ (కెప్టెన్), కుశాల్ బర్టెల్, అసిఫ్ షేక్, భీమ్ షార్కి, సోమ్‌పాల్, దీపేంద్ర సింగ్, గుల్షాన్ జా, కుశాల్ మల్లా, కరణ్, సందీప్ లమిచానె, లలిత్ రాజ్‌బాన్షీ