Asia Cup 2023 Ind vs Pak Match Empty Stadium : ఆసియా కప్-2023 భాగంగా కొలొంబో వేదికగా నేడు సెప్టెంబర్ 10న టీమ్ఇండియా-భారత్ సూపర్ ఫోర్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్.. టీమ్ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే పాక్ అంచనాలను తలకిందులు చేస్తూ భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (56), శుభ్‌మన్ గిల్ (58) ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించి టీమ్ఇండియాకు మంచి శుభారంభాన్ని అందించారు.
ఈ ఇద్దరు ఓపెనర్లు.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే ఒకరి తర్వాత మరొకరు వరుసగా ఔట్ అయ్యారు. తర్వాత క్రీజులోకి కోహ్లీ, కేఎల్ రాహుల్ వచ్చారు. అయితే ఈ క్రమంలోనే 24 ఓవర్ల తర్వాత వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. దీంతో అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది. కానీ ఆ తర్వాత వర్షం తగ్గాక ఓవర్లను కుదించి మ్యాచ్‌ను పునఃప్రారంభించారు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఎన్నడూ లేని పలు ఆసక్తికర దృశ్యాలు కనపడ్డాయి. సాధారణంగా భారత్-పాక్ మ్యాచ్ అంటే స్టేడియాలు క్రికెట్ ప్రేమికులతో నిండిపోతాయి. కానీ ఈ సారి మాత్రం అలా జరగలేదు. స్టేడియం మొత్తం ఖాళీగా కనిపించింది. ఈ దృశ్యాలు టీవీ చూస్తున్న క్రికెట్ అభిమానులను తీవ్రంగా కలిచివేశాయి. షాక్‌కు గురి చేశాయి.
India Vs Pak Match Rain Update : ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ వేదిక స్టేడియంలో 15000కు పైగా సీట్లు ఖాళీగా ఉన్నట్లు సమాచారం అందింది. క్రికెట్ హిస్టరీలో ఇదే పెద్ద షాకింగ్ విషయమనే చెప్పాలి. మ్యాచ్ ప్రారంభానికి కొద్ది సేపు క్రితం టికెట్ల రేట్లు తగ్గించినా కూడా ప్రేక్షకులు టికెట్లు కొనడానికి ఆసక్తి చూపలేదట. ఈ పరిస్థితి అంతటికీ ప్రధాన కారణం వర్షమే. దీని వల్లే ప్రేక్షకులు మైదానానికి రాలేకపోతున్నారు. ఏదేమైనా యావత్ క్రీడా చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన టీమ్ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌కు ఇలాంటి పరిస్థితి రావడంపై నెటిజన్లు, అభిమానులు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.