తెలంగాణ

telangana

ETV Bharat / sports

Asia Cup 2023 : కొలొంబోను ముంచెత్తున్న వర్షాలు.. అనుకున్నది ఒకటి.. జరుగుతోంది మరోకటి! - ఇండియా వర్సెస్​ పాకిస్థాన్​ ఆసియా కప్​

Asia Cup 2023 : ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్​నకు.. 2023 ఆసియా కప్ ఆటగాళ్లకు​ ప్రాక్టీస్​గా ఉపయోగపడుతుందని బీసీసీఐ భావించింది. కానీ ఇప్పుడు టీమ్‌ఇండియాను వరుణుడు కలవరపెడుతున్నాడు.

Asia Cup 2023
Asia Cup 2023

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 6:56 AM IST

Updated : Sep 8, 2023, 11:22 AM IST

Asia Cup 2023 :2023 ప్రపంచకప్​నకు ప్రస్తుత ఆసియాకప్​ టోర్నమెంట్ సెమీఫైనల్​గా భావించి.. బలాబలాలను పరీక్షించుకోవచ్చని భారత్ అనుకుంది. కానీ ఈ అంచనాలను తలకిందులు చేస్తూ.. ప్రణాళికలన్నింటినీ వరుణుడు దెబ్బతీసేలా కనిపిస్తున్నాడు. ఈ మినీటోర్నీకి పాకిస్థాన్​కు ప్రత్యామ్నాయ వేదికగా శ్రీలంకను ఎంచుకోవడమే.. బీసీసీఐ తప్పిదమా అన్న ప్రశ్న తలెత్తే పరిస్థితి ఏర్పడింది.

గాయాల నుంచి కోలుకొని.. జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన ప్లేయర్లకు పరీక్షలా నిలుస్తుందని, వరల్డ్​ కప్​నకు ముందు ఈ టోర్నీ ఓ ప్రాక్టీస్​లా ఉపయోగపడుతుందని భావించింది టీమ్ఇండియా. కానీ వాస్తవంలో జరుగుతున్నది వేరు. ఎలాంటి అంతరాయం లేకుండా టీమ్ఇండియా ఒక్క మ్యాచ్​ను కూడా ముగించే పరిస్థితి కనిపించడం లేదు. ఫ్యాన్స్ ఎప్పటినుంచే ఆత్రుకగా ఎదురుచూసిన ఇండోపాక్ మ్యాచ్​ కూడా వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ మ్యాచ్​లో భారత్​కు బౌలింగ్ చేసే అవకాశమే రాలేదు. ఎన్నో అంచనాలతో జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన బుమ్రా ఇప్పటివరకూ ఆసలు వన్డే మ్యాచ్ ఆడనేలేదు.

Asia Cup 2023 Schedule : అయితే ఇప్పటి నుంచి టోర్నమెంట్​లో సూపర్ 4 మ్యాచ్​లన్నీ.. కొలొంబోలో జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్​కు సైతం కొలొంబోనే వేదిక కానుంది. కానీ ప్రస్తుత వర్షాలు.. కొలొంబోనూ ముంచెత్తుతున్నాయి. సెప్టెంబర్ 10న జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్​పైనా వర్షం ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో టీమ్ఇండియా ఫ్యాన్స్ మళ్లీ అందోళన చెందుతున్నారు. ఆ ఒక్క మ్యచ్​కే కాకుండా.. సూపర్ 4తో సహా ఫైనల్​కూ వర్షం ముప్పు పొంచి ఉండడం వల్ల టోర్నీనే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. వర్షాల కారణంగా ప్రాక్టీస్​ సైతం ఇండోర్​కే పరిమితమైంది. దీంతో ఈ టోర్నీని​.. వరల్డ్ కప్​నకు ప్రాక్టీస్​గా భావించిన ఆసియా ఖండపు జట్లన్నింటికీ ఇది నిరాశ కలిగించే విషయమే. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Ind Vs Pak Asia Cup :టీమ్​ఇండియా తుది జట్టు (అంచనా) :

రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జడేజా, బుమ్రా, షమీ, శ్రేయస్ అయ్యర్/కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, సిరాజ్

Asia Cup Most Runs By Indian Batters : ఆసియా కప్​లో భారత బ్యాటర్ల హవా.. సింగిల్ ఎడిషన్​లో టాప్ 5 ఎవరంటే?

Asia Cup 2023 Pak vs Bangladesh : 'టోర్నీమొత్తం చీకటిలో నిర్వహించేవారా?'.. PCBపై క్రికెట్ ఫ్యాన్స్ గరం!

Last Updated : Sep 8, 2023, 11:22 AM IST

ABOUT THE AUTHOR

...view details