Asia Cup 2023 Ind vs Pak Reserve Day Weather : 2023 ఆసియా కప్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు వరుణుడు.. అంతరాయం కలిగిస్తూనే ఉన్నాడు. ఇరుజట్ల మధ్య లీగ్ మ్యాచ్ను తన ఖాతాలో వేసుకున్న వరుణుడు.. సూపర్ 4 మ్యాచ్కు సైతం అడ్డంకిగా మారాడు. ఆదివారం కొలంబో పి. ప్రేమదాస స్టేడియంలో జరిగిన దాయాదుల సమరంలో 24.1 ఓవర్ల వద్ద వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. దీంతో ఆట సోమవారం రిజర్వ్ డేకు వాయిదా పడింది.
అయితే సోమవారం కూడా కొలంబోలో దాదాపు అదే పరిస్థితి ఉండనున్నట్లు తెలుస్తోంది. రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందని అక్కడి వాతావరణశాఖ తెలిపింది. మరీ ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్యలో వర్షం కురిసే అవకాశం 80 శాతం ఉన్నట్లు సమాచారం.
నేడు ( సోమవారం ) కూడా వర్షం అంతరాయం కలిగిస్తే.. ఓవర్లు కుదించి మ్యాచ్ను నిర్వహించే అవకాశాల్ని పరిశీలిస్తారు. లేదా డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితం తేలే ఛాన్స్ ఉంది. ఇక ఈ రెండింటికీ అవకాశం లేకపోతే మరోసారి మ్యాచ్ రద్దవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో టీమ్ఇండియా ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.