తెలంగాణ

telangana

ETV Bharat / sports

Asia Cup 2023 IND VS PAK : భారత్​తో మ్యాచ్​.. మాకు కావాల్సింది అదే బాసు అంటున్న పాక్​ కెప్టెన్ - ఇండియా పాక్ మ్యాచ్​పై బాబర్ ఆజామ్

Asia Cup 2023 IND VS PAK : భారత్ పాక్ మ్యాచ్​ పోరు ఏ స్థాయిలోనైనా చూసేందుకు ఆసక్తికరంగానే ఉంటుంది. ఇటీవల ఎమర్జింగ్‌ ఆసియా కప్‌లో రెండుసార్లు భారత్ - పాక్‌ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లో ఆసియా కప్‌లో భాగంగా ఈ రెండు జట్ల పోటీ జరగనుంది. ఈ క్రమంలో దాయాదుల పోరు ఎలా ఉంటుందనే దానిపై పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌ మాట్లాడాడు. ఏమన్నాడంటే?

Asia Cup 2023 IND VS PAK : భారత్​తో మ్యాచ్​.. మేం అదే కోరుకుంటాం అంటున్న పాక్​ కెప్టెన్
Asia Cup 2023 IND VS PAK : భారత్​తో మ్యాచ్​.. పాక్​ కెప్టెన్ బాబార్​ ఇంట్రెస్టింగ్ కామెంట్స్​

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2023, 1:30 PM IST

Asia Cup 2023 IND VS PAK : చిరకాల ప్రత్యర్థులైన భారత్ - పాకిస్థాన్‌ జట్ల మధ్య ఏ స్థాయిలో మ్యాచ్‌ జరిగినా ఇరు దేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్​ అభిమానుల్లో విపరీతంగా ఆసక్తి ఉంటుంది. అయితే ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్​ జరిగి దాదాపు పదేళ్లు దాటిపోయింది. అప్పటి నుంచి కేవలం ఐసీసీ బడా టోర్నీల్లో మాత్రమే ఈ రెండు టీమ్​లు తలపడుతున్నాయి. అందుకే ఈ మ్యాచులకు హైప్ కూడా మరింత ఎక్కువగా ఉంటుంది.

అయితే ఈ క్రమంలోనే త్వరలో జరిగే ఆసియా కప్‌.. ఆ తర్వాత జరిగే వన్డే ప్రపంచకప్‌ వేదికగా దాయాదుల మధ్య మ్యాచులు జరగనున్నాయన్న సంగతి తెలిసిందే. ఆసియా కప్​ మరో మూడు రోజుల్లో గ్రాండ్​గా ప్రారంభంకానుంది. దాయాది రెండు జట్లూ ఒకే గ్రూపులో ఉన్నాయి. కాబట్టి కచ్చితంగా రెండుసార్లు తలపడతాయి! అదే ఫైనల్ చేరితే మరోసారి టైటిల్ కోసం తలపడతాయి. ఈ మ్యాచుల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్​లు జరిగే వేదికల్లో హోటల్ రూమ్స్​ కూడా భారీ ధరకు బుక్కైపోతున్నాయి.

ఈ క్రమంలో దాయాదుల పోరు ఎలా ఉంటుందనే దానిపై పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌ మాట్లాడాడు. ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడూ ఆసక్తరంగానే ఉంటుందని చెప్పాడు. ఈ మ్యాచ్​ కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఈ రెండు జట్ల మధ్య పోటీ ఎంతో ఆసక్తిగా ఉంటుందని, అభిమానులతో పాటు ప్లేయర్స్​ కూడా దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పాడు. "రెండు జట్ల మధ్య మ్యాచ్​ ఎప్పుడూ ఎంతో ఆసక్తికరంగా, గొప్పగా ఉంటుంది. ప్రపంచమొత్తం ఈ మ్యాచ్​లను చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. భారత్ పాకిస్థాన్ మ్యాచుల్లో క్రికెట్ స్థాయి అత్యుత్తమంగా ఉంటుంది. అలాగే గట్టి పోటీ ఉంటుంది. మేం అదే కోరుకుంటాం. ఇరు జట్ల ఆటగాల్లు నూటికి నూరు శాతం తమ వంతుగా బెస్ట్​ ఎఫర్ట్ పెట్టి ఆడతారు. లేదంటే అభిమానులు ఆ మజాను మిస్​ అవుతారు" అని బాబార్ ఆజామ్​ పేర్కొన్నాడు. కాగా, భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్ సెప్టెంబర్ 2న జరగనుంది.

ICC Latest ODI Rankings : వన్డేల్లో నెం.1గా పాకిస్థాన్​.. మరి టీమ్​ఇండియా స్థానం ఎంతో తెలుసా?

Asia Cup 2023 Covid : ఆసియా కప్​నకు కొవిడ్ ముప్పు.. అక్కడ్నుంచే వ్యాప్తి చెందిందా?

ABOUT THE AUTHOR

...view details