Asia Cup 2023 Ind vs Pak :ఆసియా కప్‌లో హై వోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత వన్డేల్లో భారత్.. పాకిస్థాన్‌ను ఢీ కొట్టనుంది. 2019 ప్రపంచకప్‌లో రెండు జట్లు చివరిసారిగా తలపడగా.. ఆ తర్వాత ఇరుజట్ల మధ్య వన్డే మ్యాచ్ ఆడే ఛాన్స్ రాలేదు. అప్పటి నుంచి భారత్-పాక్ నాలుగు సార్లు మాత్రమే టీ20ల్లో ఎదురుపడ్డాయి. ఈ ఫార్మాట్లో కూడా మ్యాచ్ జరిగి దాదాపు పది నెలలు కావస్తోంది. చివరగా 2022 పొట్టి ప్రపంచకప్‌లో ఇండోపాక్ మ్యాచ్ జరిగింది. ఇక చాలా రోజుల తర్వాత సెప్టెంబర్ 2న జరిగే దాయాదుల పోరును వీక్షించేందుకు యావత్ క్రీడాలోకం ఉత్సాహంగా ఉంది. అంతే కాకుండా అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈ మినీ టోర్నీలో ఇరుజట్లు మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. దీంతో ఆసియా కప్‌పై ఆసక్తి తీవ్రంగా పెరిగిపోయింది.
Pallekele Stadium Weather :అయితే వరుణుడు.. క్రికెట్ ఫ్యాన్స్ ఉత్సాహంపై నీళ్లు చల్లేందుకు సిద్ధమయ్యాడు. శనివారం కాండీ వేదికగా జరిగే భారత్, పాక్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. వర్షం పడేందుకు 90 శాతం ఛాన్స్ ఉందనీ.. వాతావరణంలో తేమ 84 శాతం ఉంటుందని శ్రీలంక వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆసియా కప్‌లో కీలక మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగిస్తుందేమోనని క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.