తెలంగాణ

telangana

ETV Bharat / sports

Asia Cup 2023 IND VS PAK : కోహ్లీ-కేఎల్ రాహుల్ సెంచరీ.. పాకిస్థాన్ ముందు భారీ లక్ష్యం.. - Kohli 13 Thousand Runs in ODI

Asia Cup 2023 IND VS PAK Super 4 Match : పాకిస్థాన్​తో జరుగుతున్న సూపర్​ 4 మ్యాచ్​లో టీమ్​ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. ఈ ఇన్నింగ్స్​లో రోహిత్, గిల్ హాఫ్​ సెంచరీలతో మెరవగా.. కోహ్లీ-కేఎల్ రాహుల్​ సెంచరీలతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. పాకిస్థాన్​ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు.

Asia Cup 2023 IND VS PAK : కోహ్లీ-కేఎల్ రాహుల్ సెంచరీ
Asia Cup 2023 IND VS PAK : కోహ్లీ-కేఎల్ రాహుల్ సెంచరీ

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 6:42 PM IST

Updated : Sep 11, 2023, 6:47 PM IST

Asia Cup 2023 IND VS PAK Super 4 Match : వర్షం కారణంగా నిన్న(సెప్టెంబర్ 10) ఆగిపోయిన టీమ్​ఇండియా-పాకిస్థాన్ సూపర్ 4 మ్యాచ్​ ఎట్టకేలకు రిజర్వ్​ డే అయిన నేడు(సెప్టెంబర్ 11) కొనసాగుతోంది. అయితే ఈ మ్యాచ్​లో ఇప్పుడు టీమ్​ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. ఇవాళ క్రీజులోకి వచ్చిన కోహ్లీ-కేఎల్ రాహుల్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరు చేరో సెంచరీ బాదారు. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన కేఎల్ రాహుల్ ఆడిన తొలి మ్యాచ్ ఇది. ఇందులోనే రాహుల్​ సెంచరీ బాదడం విశేషం. మొత్తంగా నిర్ణీత 50 ఓవర్లో టీమ్​ఇండియా 2 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. కోహ్లీ 94 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సల సాయంతో 122 అజేయ పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్​ 106 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్​ల సాయంతో 111 అజేయ పరుగులు చేశాడు.

Kohli 13 Thousand Runs in ODI : కోహ్లీ 13 వేల రన్స్​....కోహ్లీకి ఇది అంతర్జాతీయ క్రికెట్​లో 77వ సెంచరీ కావడం విశేషం. వన్డేలో 47వది. ఈ క్రమంలోనే కోహ్లీ ఓ మార్క్​ను కూడా అందుకున్నాడు. వన్డేల్లో 13 వేల పరుగుల మార్క్​ను అందుకున్నాడు. అలానే అంతర్జాతీయ క్రికెట్​లో నెం.3స్థానంలో అత్యంత వేగంగా 14 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్​గా నిలిచాడు. ఇంకా వన్డేల్లో అత్యధికంగా 50+ అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మూడో బ్యాటర్​గానూ అవతరించాడు. విరాట్ 112 సార్లు చేయగా.. అందరికన్నా ఎక్కువగా సచిన్ 145 సార్లు 50 ప్లస్​ స్కోరు నమోదు చేశాడు. ఆ తర్వాత కుమార సంగక్కర (118) చేశాడు.

ఇది రెండో సారి.. పాకిస్థాన్​పై వరుసగా నలుగురు బ్యాటర్లు అర్ధశతకాలు సాధించడం ఇది రెండో సారి. 2017లో బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాప్‌ -4 బ్యాటర్లు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. అంతకుముందు ఇంగ్లాండ్‌పైనా (2006, 2007లోనూ) టీమ్​ఇండియా బ్యాటర్లు ఈ ఫీట్‌ను అందుకున్నారు. ఇప్పుడీ మ్యాచ్‌లో ఇప్పటికే విరాట్, రాహుల్ (79*), గిల్ (58), రోహిత్ (56) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.

Last Updated : Sep 11, 2023, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details