Asia Cup 2023 IND Vs BAN :2023 ఆసియా కప్ సూపర్-4 లో భాగంగా భారత్.. బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 50 ఓవర్లకు 265-8 పరుగులు చేసింది. అనంతరం 266 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మతీవ్రంగా నిరాశ పరిచాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే బంగ్లాదేశ్ అరంగేట్ర ఆటగాడు తన్జిమ్ హసన్‌కు.. పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్ వన్డేల్లో 15వ సారి డకౌటయ్యాడు. దీంతో అత్యధిక సార్లు డకౌటైన భారత ఆటగాళ్ల జాబితాలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరసన చేరాడు.
గత మ్యాచ్‌లో కూడా రోహిత్.. 20 ఏళ్ల శ్రీలంక స్పిన్నర్ వెల్లలాగే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. అయితే ప్రపంచంలోని మేటి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొనే రోహిత్.. ప్రపంచకప్‌కు ముందు ఇలా వరుస మ్యాచ్‌ల్లో అనుభవం లేని కుర్రాళ్లకు వికెట్ సమర్పించుకోవడం వల్ల ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.
తిలక్ కూడా తొందరగానే.. తెలుగు కుర్రాడుతిలక్ వర్మ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ అతడికి డెబ్యూ క్యాప్ అందించి జట్టులోకి స్వాగతం పలికాడు. అయితే ఎన్నో అంచనాలతో బ్యాటింగ్‌కు దిగిన తిలక్ (5 పరుగులు).. తొందరగానే పెవిలియన్ చేరాడు. అతడు కూడా తన్జిమ్ హసన్‌కే చిక్కాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో క్లీన్ బౌల్డయ్యాడు.