తెలంగాణ

telangana

ETV Bharat / sports

Asia Cup 2023 : భారత్​ 7.. శ్రీ లంక 6.. ఈ సారి ఆసియా కప్​ ఎవరికి దక్కనుందో ? - ఆసియా కప్​ 2023 కేఎల్​ రాహుల్​

క్రికెట్​ లవర్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక ఆసియాకప్‌ టోర్నీ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. హోరా హోరీగా జరగనున్న ఈ మెగా టోర్నీలో తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్​, నేపాల్‌ తలపడనున్నాయి. గ్రూప్‌ దశలో సెప్టెంబర్‌ 2న పాకిస్థాన్​తోను, సెప్టెంబర్‌ 4న నేపాల్‌తోనూ భారత్‌ పోటీపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లకు భారత్‌ జట్టుకు కేఎల్​ రాహుల్ దూరమయ్యాడు. వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో ప్రతి జట్టూ తమ శక్తి సామర్థ్యాలను పరీక్షించుకునేందు ఆసియాకప్‌ను వేదికగా మార్చుకొనే అవకాశం ఉంది. అయితే ఎంతో ఉత్కంఠగా జరగనున్న ఈ ఆసియా కప్​ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీ కోసం..

Asia Cup 2023
ఆసియా కప్​ 2023

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2023, 5:04 PM IST

Asia Cup 2023 : ఈ ఏడాది భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్‌నకు సన్నాహకంగా భావిస్తున్న ప్రతిష్టాత్మక ఆసియా కప్‌బుధవారం నుంచి ప్రారంభం కానుంది. పాకిస్థాన్​, శ్రీలంక వేదికగా దాదాపు నాలుగు స్టేడియంలో ఆసియా కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. పాక్‌లోని ముల్తాన్‌, లాహోర్​తో పాటు శ్రీలంకలో పల్లెకెల్లె, కొలొంబో స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక ఈ మెగా టోర్నీ కోసం బెంగళూర్‌లో టీమ్​ఇండియా ముమ్మరంగా సాధన చేసింది .

Asia Cup 2023 Schedule : మరోవైపు ఈ ఆసియాకప్‌ కోసం ఆరు దేశాలు పోటీపడనున్నాయి. ఆగస్టు 30 మధ్యాహ్నం జరగనున్న తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ - నేపాల్‌ తలపడనుండగా.. ఈ మ్యాచ్ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌.. ఇప్పుడు మళ్లీ వన్డే ఫార్మాట్‌లో జరగనుంది.

Asia Cup 2023 Format : గతేడాది పొట్టి ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌ను శ్రీలంక గెలుచుకోగా.. ఇప్పటి వరకు భారత్‌ అత్యధికంగా ఏడుసార్లు ఆసియాకప్‌లో విజేతగా నిలిచింది. దీంతో ఈసారి కూడా నాలుగు జట్ల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. భారత్‌, పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్ ఈ రేసులో ఉన్నాయి. వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో ప్రతి జట్టూ తమ శక్తిసామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ఇదొక వేదికగా మార్చుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Asia Cup 2023 Teams : భారత్‌, పాకిస్థాన్​, నేపాల్‌ గ్రూప్‌-ఏలో, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌ గ్రూప్‌-బిలో ఉన్నాయి. ఈ రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌-4కు అర్హత సాధిస్తాయి. గ్రూప్‌ దశలో భారత్‌ సెప్టెంబర్‌ 2న పాకిస్థాన్​తోనూ, సెప్టెంబర్‌-4న నేపాల్‌తోనూ తలపడనుంది. రోహిత్‌శర్మ నేతృత్వంలో భారత జట్టు ఈ టోర్నీలో అదృష్టం పరీక్షించుకోనుంది. గాయం కారణంగా పాకిస్థాన్​, నేపాల్‌తో జరిగే తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ దూరంకానున్నాడు. ఇషాన్‌ కిషన్‌ వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

Asia Cup 2023 IND VS PAK : భారత్​తో మ్యాచ్​.. మాకు కావాల్సింది అదే బాసు అంటున్న పాక్​ కెప్టెన్

Asia Cup 2023 Covid : ఆసియా కప్​నకు కొవిడ్ ముప్పు.. అక్కడ్నుంచే వ్యాప్తి చెందిందా?

ABOUT THE AUTHOR

...view details