తెలంగాణ

telangana

ETV Bharat / sports

Asia Cup 2023 Final IND Vs SL : ఆసియా కప్​లో 'లంక' ఆటే వేరు.. కొలంబోలో వారిదేపైచేయి.. భారత్​కు గట్టి సవాలే!

Asia Cup 2023 Final IND Vs SL : ఆసియా కప్‌ అంటే చాలు.. ఎప్పుడూ శ్రీలంక విరుచుకుపడుతోంది. ఎక్కడా లేని ఉత్సాహంతో మైదానంలో ఆడుతోంది. ఆ ఆటతీరుతోనే ఈ ఏడాది ఆసియా కప్​ ఫైనల్​కు చేరుకుంది. అయితే లంక గత రికార్డులు టీమ్​ఇండియా అభిమానులను కలవరపెడుతున్నాయి. అవేంటంటే?

Asia Cup 2023 Final IND Vs SL
Etv Asia Cup Asia Cup 2023 Final IND Vs SLFinal IND Vs SL

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 12:35 PM IST

Updated : Sep 15, 2023, 12:46 PM IST

Asia Cup 2023 Final IND Vs SL :మినీ టోర్నీ ఆసియా కప్​-2023 చివరి దశకు చేరుకుంది. అయితే ఈ టోర్నీలో మరోసారి చిరకాల ప్రత్యర్థులు భారత్​- పాకిస్థాన్​ మధ్య ఫైనల్​ మ్యాచ్​ను చూడాలనుకున్న ఫ్యాన్స్​ కల కలగానే మిగిలిపోయింది. గురువారం జరిగిన సూపర్​-4 మ్యాచ్​లో పాకిస్థాన్​ను చిత్తు చేసిన శ్రీలంక.. 11వ సారి ఫైనల్​కు దూసుకెళ్లింది.

ఆసియా కప్​లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి.. కప్పు కొట్టడం అలవాటుగా మార్చుకుంది శ్రీలంక సేన. గతేడాది కూడా ఫైనల్​ చేరడమే కష్టం అనుకుంటే ఏకంకా ట్రోఫీనే పట్టేసింది. ఈసారి కూడా క్రీడా విశ్లేషకులు భారత్​, పాక్​ ఫైనల్​ చేరుకుంటాయని జోస్యం చెప్పగా.. లాస్ట్​ బాల్​ థ్రిల్లింగ్​ మ్యాచ్​లో గెలిచి లంక ఫైనల్​ చేరింది.ఆదివారం.. టీమ్​ఇండియాతో పోటీపడనుంది.

టీమ్​ఇండియా ఫైనల్​కు చేరుకుందన్న విషయం పక్కనపెడితే.. అభిమానులను మరో విషయం తీవ్రంగా కలవరపెడుతోంది. స్వదేశంలో శ్రీలంకకు ఆసియా కప్​లో తిరుగులేని రికార్డు ఉంది. గతంలో నాలుగుసార్లు ఆసియా కప్ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన శ్రీలంక.. మూడుసార్లు ఆ జట్టే విజేతగా నిలిచింది. ఒక్కసారి మాత్రమే 2010లో భారత్​ విజయం సాధించింది.

Asia Cup 2023 Final : సెప్టెంబర్​ 17వ తేదీన ఫైనల్​ జరగబోతున్న కొలంబోలో కూడా శ్రీలంక రికార్డు మరింత మెరుగ్గా ఉంది. అక్కడ ఫైనల్​ మ్యాచ్​ జరిగిన ప్రతీసారి లంకనే గెలిచింది. 2010లో భారత్​ కప్​ను గెలిచినప్పుడు.. ఫైనల్​ మ్యాచ్​ డంబుల్లాలో జరిగింది. ధోనీ కెప్టెన్సీలోని టీమ్​ఇండియా.. ఆ ఫైనల్లో 81 పరుగులతో లంకను చిత్తు చేసి ఆసియా కప్ గెలిచింది.

స్వదేశంలో శ్రీలంక ఆసియా కప్ రికార్డులు ఇవే

  • ఆసియా కప్​ను శ్రీలంక తొలిసారి 1986లో గెలుచుకుంది. అప్పుడు కొలంబోలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో ఫైనల్ జరిగింది. ఆ మ్యాచ్​లో పాకిస్థాన్​ను 5 వికెట్లతో చిత్తు చేసి ట్రోఫీ గెలిచింది శ్రీలంక.
  • 1997లో శ్రీలంక రెండోసారి ట్రోఫీ గెలిచింది. ఇప్పుడు ఫైనల్ జరగబోతున్న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలోనే అప్పుడు కూడా ఫైనల్ జరిగింది. ఆ మ్యాట్​లో భారత్​ను 8 వికెట్లతో ఓడించి శ్రీలంక టైటిల్ కొట్టేసింది.
  • 2004లోనూ సీన్​ రిపీట్​. ప్రేమదాస స్టేడియంలో ఫైనల్ జరగ్గా.. శ్రీలంక 25 పరుగులతో గెలిచి ఆసియా కప్​ను మూడోసారి కైవసం చేసుకుంది.
  • చివరిసారి శ్రీలంకలో 2010లో ఆసియా కప్ జరిగింది. అప్పుడు ఫైనల్ డంబుల్లాలోని రణగిరి డంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది. ఆ మ్యాచ్​లో శ్రీలంకను 81 పరుగులతో చిత్తు చేసిన భారత్​.. ఆసియా కప్ గెలిచింది.

అండర్ డాగ్స్‌తో డేంజరే..
Asia Cup 2023 Sri Lanka Records : ఈసారి కూడా డిఫెండింగ్ ఛాంపియన్​ శ్రీలంక బరిలోకి దిగినా.. ఫైనల్ చేరుతుందని ఎవరూ అనుకోలేదు. కానీ అనూహ్య రీతిలో భారత్​ చేతుల్లో ఓడినా.. బంగ్లాదేశ్, పాకిస్థాన్​లను చిత్తు చేసి ఫైనల్ చేరింది. సూపర్ 4లో ఒకింత టీమ్​ఇండియాను భయపెట్టింది. పాకిస్థాన్​తో శ్రీలంక ఆడిన విధానం చూస్తే మాత్రం ఆ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. అందులోనూ స్వదేశం, పైగా తమకు బాగా కలిసొచ్చే ప్రేమదాస స్టేడియంలో ఈసారి లంక మళ్లీ ఏం మాయ చేస్తుందో అన్న ఆందోళన అటు టీమ్​ఇండియాలో, ఇటు అభిమానుల్లో ఉంది.

Last Updated : Sep 15, 2023, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details