Asia Cup 2023 Covid :క్రికెట్ అభిమానులను అలరించడానికి మరో నాలుగు రోజుల్లో 2023 ఆసియ కప్టోర్నమెంట్ మొదలవ్వనుంది. భారత్, పాకిస్థాన్ సహా ఆరు జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి. ఇక టోర్నీలో పాల్గొనే ఆయా జట్లు.. టైటిల్ గెలిచేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే అంతా సజావుగా సాగుతున్న వేళ.. ఓ సమస్య కలవరపెడుతోంది. అదేంటంటే..
ఆసియా కప్ ముంగిట టోర్నీలో పాల్గొనే శ్రీలంక ప్లేయర్లకు కొవిడ్ సోకింది. లంక స్టార్ బ్యాటర్ కుశాల్ పెరీరా, పేసర్ అవిష్క ఫెర్నాండోకు(Sri Lanka Players Covid) కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం వీరిని ఐసోలేషన్‌లో ఉంచారు. రీసెంట్గా జరిగిన శ్రీలంక ప్రీమియర్ లీగ్‌లో కరోనా వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. దీంతో సదరు క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
అయితే ప్రస్తుతం కొవిడ్ ప్రభావం అంతగా ఏమీ లేకపోయినప్పటికీ.. వైరస్ సోకిన ఆటగాళ్లు కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఆ జట్టుకు తీవ్ర నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. టోర్నీ ప్రారంభమయ్యేలోపు.. ఆ ఆటగాళ్లు కోలుకొని నెగిటివ్ నిర్ధరణ అయితేనే వారు మళ్లీ గ్రౌండ్లో కనబడే ఛాన్స్ ఉంది. కాగా టోర్నీలో భారత్ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే జరగనున్నాయి. దీంతో టోర్నీ మొదలయ్యాక ఇతర ఆటగాళ్లకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకొని.. నిర్వాహకులు మైదానాలు, డగౌట్లు, డ్రెస్సింగ్ రూమ్‌లు కచ్చితంగా శానిటైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది.