తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాకిస్థాన్​తో మ్యాచ్​, రోహిత్​ శర్మ, భువనేశ్వర్​ సూపర్ రికార్డ్స్​ - ఆసియాకప్​ 2022 భువనేశ్వర్​ కుమార్​

Asia cup 2022 Rohithsharma record ఆసియా కప్​ 2022లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ, పేసర్​ భువనేశ్వర్​ కుమార్​ అరుదైన రికార్డులును సాధించారు. అవేంటంటే

TEAMINDIA PAKISTHAN
టీమ్​ఇండియా పాకిస్థాన్​

By

Published : Aug 29, 2022, 9:41 AM IST

Asia cup 2022 Rohithsharma record టీమ్​ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆసియాకప్‌-2022లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద రోహిత్‌ ఈ ఘనతను అందుకున్నాడు.ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో 3499 పరుగులతో రోహిత్‌ టాప్‌లో ఉండగా.. గప్టిల్‌(3497), విరాట్‌ కోహ్లీ(3341) పరుగులతో రెండు మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.

భువి రికార్డు.. మరోవైపు ఈ మ్యాచ్‌లో పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కూడా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన అతడు ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో పాకిస్థాన్​పై అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తన రెండో వికెట్‌గా ఆసిఫ్ అలీను ఔట్‌ చేసిన అనంతరం అతడు ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇప్పటి వరకు పాకిస్తాన్‌పై భువీ 9 వికెట్లు పడగొట్టాడు. కాగా అంతకు ముందు ఈ రికార్డు టీమ్​ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్ పఠాన్(6 వికెట్లు) పేరిట ఉండేది. ఈ ఘనత సాధించిన జాబితాలో 9 వికెట్లతో భువీ తొలి స్థానంలో ఉండగా.. హార్దిక్‌ పాండ్యా 7 వికెట్లతో రెండు స్థానంలో నిలిచాడు. ఇక అఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ పోరులో టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సిక్స్‌ కొట్టి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. తద్వారా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఓటమికి టీమ్​ఇండియా బదులు తీర్చుకుంది.

ఇదీ చూడండి:భారత్‌ అదరహో, ఉత్కంఠ పోరులో పాక్‌పై ప్రతీకార విజయం

ABOUT THE AUTHOR

...view details