తెలంగాణ

telangana

ETV Bharat / sports

Asiacup 2022: ఛాంపియన్​ శ్రీలంకకు ప్రైజ్​మనీ ఎంతంటే?

ఆసియాకప్​ 2022లో విజేతగా నిలిచిన శ్రీలంక, రన్నరప్​గా నిలిచిన పాకిస్థాన్​కు ఎంత ప్రైజ్​మనీ దక్కింది? ఈ టోర్నీలో టాప్‌ రన్‌ స్కోరర్‌ ఎవరు? అత్యధిక వికెట్లు తీసింది ఎవరు? తెలుసుకుందాం.

asia cup 2022 prize money
ఆసియాకప్​ 2022 శ్రీలంక ప్రైజ్​మనీ

By

Published : Sep 12, 2022, 2:27 PM IST

ఆసియాకప్‌ 2022 ఫైనల్​లో పాకిస్థాన్​ను ఓడించి ఛాంపియన్​గా అవతరించింది శ్రీలంక. అదివారం దుబాయ్‌ వేదికగా జరిగిన తుదిపోరులో గెలిచి ట్రోఫీని ముద్దాడింది. కాగా ఇది శ్రీలంకకు 6వ ఆసియాకప్‌ టైటిల్‌ కావడం విశేషం. ఇక అండర్‌ డాగ్స్‌గా బరిలోకి దిగి ఛాంపియన్స్‌గా నిలిచిన శ్రీలంకకు ఫ్రైజ్‌మనీ ఎంత లభించింది?.. ఆసియాకప్ 2022 టాప్‌ రన్‌ స్కోరర్‌ ఎవరు? ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

విజేతకు ఎంతంటే.. ఆసియాకప్‌ విజేతగా నిలిచిన శ్రీలంకకు ఫ్రైజ్‌మనీ రూపంలో లక్షా ఏభై వేల డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు కోటి పందొమ్మిది లక్షల రూపాయలు) లభించింది. ఇందుకు సంబంధించిన చెక్‌ను బీసీసీఐ అద్యక్షుడు గంగూలీ శ్రీలంక కెప్టెన్‌ దసన్‌ శనకకు అందజేశాడు. ఇక రన్నరప్‌గా నిలిచిన పాకిస్థాన్​కు 75,000 డాలర్లు (యాభై తొమ్మిది లక్షల అరవై ఆరు వేలు) ఫ్రైజ్‌మనీ దక్కింది.

ఆసియాకప్‌లో అత్యధిక పరుగుల వీరులు వీరే

  • మహ్మద్‌ రిజ్వాన్‌(పాకిస్థాన్​)- 6 మ్యాచుల్లో 281 పరుగులు
  • విరాట్‌ కోహ్లీ(భారత్‌)- 5 మ్యాచుల్లో 276 పరుగులు
  • ఇబ్రహీం జద్రాన్(ఆఫ్గాన్‌)- 5 మ్యాచుల్లో-196 పరుగులు
  • భానుక రాజపక్స(శ్రీలంక)- 6 మ్యాచుల్లో 191 పరుగులు
  • పాతుమ్ నిస్సంక(శ్రీలంక) - 6 మ్యాచుల్లో 173 పరుగులు

ఆసియాకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు

  • భువనేశ్వర్‌ కుమార్‌(టీమ్​ఇండియా)- 5 మ్యాచుల్లో 11 వికెట్లు
  • వానిందు హసరంగా(శ్రీలంక)- 6 మ్యాచుల్లో 9 వికెట్లు
  • మహ్మద్‌ నవాజ్‌(పాకిస్థాన్​)- 6 మ్యాచుల్లో 8 వికెట్లు
  • షాదాబ్ ఖాన్(పాకిస్థాన్​)- 5 మ్యాచుల్లో 8 వికెట్లు
  • హారిస్‌ రౌఫ్‌(పాకిస్థాన్​)- 6 మ్యాచుల్లో 8 వికెట్లు

ఇక ఈ మెగా ఈవెంట్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన శ్రీలంక ఆల్‌రౌండర్‌ వానిందు హసరంగాకు మ్యాన్‌ ఆఫ్‌ది టోర్నమెంట్‌ అవార్డు దక్కింది. ఇక కీలకమైన ఫైనల్‌లో 71 పరుగలతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన భానుక రాజపక్సకు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

ఇదీ చూడండి: ఆ సిరీస్​కు టీమ్​ఇండియా కెప్టెన్​గా శిఖర్​ ధావన్

ABOUT THE AUTHOR

...view details