తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాకిస్థాన్‌పై శ్రీలంక విజయం.. ఫైనల్లో మరోసారి ఢీ - ఆసియా కప్​ సూపర్​ ఫోర్ మ్యాచ్​

Asia Cup 2022 : ఆసియా కప్​ 2022 లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో 5 వికెట్ల తేడాతో గెలిచింది శ్రీలంక.

Asia Cup 2022
Asia Cup 2022

By

Published : Sep 9, 2022, 11:06 PM IST

Asia Cup 2022 : ఆసియా కప్​ 2022 లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో 5 వికెట్ల తేడాతో గెలిచింది శ్రీలంక. ​ఈ ఉత్సాహంతో ఆదివారం జరగబోయే ఫైనల్​లో కూడా విజయం సాధించాలని లంక జట్టు ఆత్రుతగా ఉంది. 121 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లంక.. మూడు ఓవర్లు మిగిలుండగానే మ్యాచ్​ను ముగించింది. పాతుమ్ నిస్సాంక 48 బంతుల్లో 55 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడికి తోడు కెప్టెన్ దాసున్​ శనక 16 బంతుల్లో 21 పరుగులు, భనుక రాజపక్స 19 బంతుల్లో 24 పరుగులు చేసి జట్టును విజయతీరాల వైపు నడిపించారు.

అంతకుముందు టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక అద్భుత ప్రదర్శన చేసింది. 19.1 ఓవర్లకే పది వికెట్లు తీసి పాకిస్థాన్​ జట్టును 121 పరుగులకే కట్టడి చేసింది. బాబర్​ అజమ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 29 బంతుల్లో ​30 పరుగులు చేశాడు. తర్వాత నవాజ్​ 18 బంతుల్లో 26 పరుగులతో రాణించాడు. మిగతా ప్లేయర్లంతా పేలవ ప్రదర్శన చేశారు.

ABOUT THE AUTHOR

...view details