తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ దెబ్బకు కింద పడిపోయిన రోహిత్, ఏం జరిగిందంటే - కింద పడిపోయిన రోహిత్​ శర్మ

కోహ్లీ, రోహిత్​ల మధ్య జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. మీరు ఆ వీడియోను ఓ సారి చూసేయండి.

Virat Kohli Rohith Sharma
Virat Kohli Rohith Sharma

By

Published : Aug 30, 2022, 10:59 AM IST

Virat Kohli Rohith Sharma : ఆసియా కప్‌ 2022లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో విజయం సాధించి టీమ్​ఇండియా శుభారంభం చేసింది. అయితే ఈ మ్యాచ్​లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అదేంటంటే..

భారత్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఏడో ఓవర్​ బౌలింగ్​ వేయడానికి పాక్ బౌలర్​ షాదబ్ ఖాన్ వచ్చాడు. అతడి బౌలింగ్​లో కోహ్లీ లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఆ బంతి నేరుగా నాన్ స్ట్రైకింగ్ ఎండ్​లో ఉన్న రోహిత్ శర్మ మీదకు దూసుకెళ్లింది. వేగంగా బంతి రావడం వల్ల ఒక్కసారిగా షాక్​కు గురైన రోహిత్ తన చేతిని అడ్డుపెట్టాడు. బంతి నేరుగా హిట్​మ్యాన్​ చేతికి తగిలి పక్కకు వెళ్లిపోగా, అతడు మాత్రం నేలపై పడిపోయాడు. అప్రమత్తమైన రోహిత్​ వెంటనే లేచి పరుగు పూర్తి చేశాడు.

కాగా, చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​పై విజయం సాధించింది టీమ్​ఇండియా. తొలుత పాక్​ జట్టు.. 19.5 ఓవర్లలో 147 పరుగుల వద్ద ఆలౌట్‌ కాగా.. భారత్​ క్రికెట్ జట్టు ఆ లక్ష్యాన్ని ఐదు వికెట్ల తేడాతో ఛేదించింది.

ఇవీ చదవండి:టీమ్​ఇండియా ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్‌, స్టార్​ పేసర్​ వచ్చేస్తున్నాడు

బ్యాట్​ తగిలి మాజీ క్రికెటర్​ విలవిల, వీడియో వైరల్​

ABOUT THE AUTHOR

...view details