తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆసియా కప్'పై కొనసాగుతున్న రగడ.. పాక్​ లేకుండానే పోరుకు సిద్ధం! - పాకిస్థాన్​ లేకుండానే ఆసియా కప్

Asia Cup 2023 Pakisthan : ఆసియా కప్ నిర్వహణ వేదికపై ప్రతిష్టంభన వీడటం లేదు. పాకిస్థాన్​లో జరిగే టోర్నమెంట్​కు రాబోమని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే ఈ సారి పాక్​ లేకండానే ఆసియా కప్​ జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..

Asia Cup 2023 Issue
'ఆసియా కప్'పై కొనసాగుతున్న రగడ.. పాక్​ లేకుండానే పోరుకు సిద్ధం!

By

Published : Jun 1, 2023, 2:50 PM IST

Asia Cup 2023 : ఆసియా కప్​పై కొనసాగుతున్న ప్రతిష్టంభన వీడటం లేదు. ఆసియా కప్​ కోసం పాకిస్థాన్​కు రాబోమని బీసీసీఐ తేల్చిచెప్పింది. దీంతో ఆసియా వేదికపై ప్రతిష్టంభన నెలకొంది. దీనికి పాకిస్థాన్​ ప్రతిపాదించిన హైబ్రిడ్​ మోడల్​ను కూడా భారత్​ తిరస్కరించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. పాకిస్థాన్​ లేకుండానే ఆసియా కప్​ ఆడే ఆవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ టోర్నమెంట్​లో పాల్గొనడానికి.. పాకిస్థాన్​ మినహా ఆసియా క్రికెట్​ మండలి (ఏసీసీ) సభ్య దేశాలన్నీ ఆసక్తి చూపినట్లు సమాచారం. పాకిస్థాన్​లో కాకుండా మరో వేదికపై నిర్వహించేదుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పాక్​ తన మాటకే పట్టుబడితే.. ఆ జట్టు లేకుండా ఈ సారి ఆసియా జరగనుందని తెలుస్తోంది.

Asai cup Pakisthan : యూఏఈనీ తటస్థ వేదికగా పాకిస్థాన్ ప్రతిపాదించింది. అయితే అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందని.. అందుకే ఆ ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించినట్లు సమాచారం. అయితే, అప్పటినుంచి వేదికగా శ్రీలంక పేరు వినిపిస్తోంది. దీనికి తోడు ఆసియా కప్​ 2023ని పాక్​లో కాకుండా శ్రీలంకలో ఆడటానికి మిగతా సభ్య దేశాలను ఏసీసీ అధ్యక్షుడు జై షా ఒప్పించారని వార్తలు వస్తున్నాయి. ఇతర ఏసీసీ దేశాలు కూడా ఇదే స్వరాన్ని వినిపిస్తున్నట్లు సమాచారం. ఈ వేదికకు పాక్​ ఒప్పుకోక పోతే.. ఆ దేశం లేకుండా టోర్నీ జరుగుతుంది. రాబోయే ఆసియా క్రికెట్ మండలి సమావేశంలో సభ్య దేశాలన్నీ శ్రీలంకనే వేదికగా ఏకగ్రీవంగా ఆమెదించే అవకాశాలున్నాయి. ఇలా జరిగితే ఏసీసీ నిర్ణయాన్ని అంగీకరించడం లేదా టోర్నీ నుంచి పూర్తిగా వైదొలగం తప్ప పాకిస్థాన్​కు మరోక మార్గం లేదు.

ఆసియా కప్​పై నెలకొన్న ప్రతిష్టంభన, జరుగుతున్న పరిణామాల వల్ల రాబోయే ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 నిర్వహణ విషయంలోనూ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీనికి తోడు తమ దేశంలో ఆసియా కప్​ ఆడకుంటే.. 2023 ఏడాది అక్టోబర్​, నవంబర్​లో జరగబోయే వన్డే వరల్డ్​ కప్ ఆడబోమని ఇదివరకే పాకిస్థాన్​ తేల్చిచెప్పింది. దీంతో ఈ టోర్నీపై కూడా పాక్​ ఎలాంటి చిక్కులు తెచ్చిపెడుతుందో అన్న ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా కప్​ రద్దు అవతుంది అన్న చర్చ తెరపైకి వచ్చింది.

ఆసియా కప్​ రద్దుకు బీసీసీఐ ప్లాన్​!

Asia cup 2023 BCCI ఇకపోతే ఆసియా కప్‌ నిర్వహణపై పాకిస్థాన్​ సమస్యలు సృష్టిస్తున్న నేపథ్యంలో.. బీసీసీఐ ఓ మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్​ రద్దు చేసేందుకు బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఆసియా కప్​ టోర్నీ స్థానంలో ఐదు దేశాల టోర్నీ నిర్వహించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే కనుక జరిగితే ఆసియా కప్​ నిర్వహించే టైమ్ విండోలో ఈ ప్రతిపాదిత ఐదు దేశాల టోర్నీ ఆడే ఆస్కారముంది. కాగా, గతేడాది ఆసియా కప్‌ టీ20 మెగా టోర్నీలో భారత్‌, పాకిస్థాన్​, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్​లతో పాటు హాంగ్‌ కాంగ్‌ హోరాహోరీగా పోటీపడ్డాయి. అయితే ఈ మెగా ఈవెంట్‌లో శ్రీలంక ట్రోఫీని సొంతం చేసుకోగా.. పాకిస్థాన్​ రన్నరప్‌గా నిలిచింది.

ABOUT THE AUTHOR

...view details