తెలంగాణ

telangana

ETV Bharat / sports

బీసీసీఐ మరో కీలక నిర్ణయం.. ఆ ఇద్దరిపై వేటు.. క్రికెట్​ అడ్వైజరీ కమిటీలో మార్పులు! - అశోక్​ మల్హోత్రా క్రికెట్ అడ్వైసరి కమిటీ

వచ్చే నెలలో సీనియర్​ సెలక్షన్ కమిటీ పోస్టులకు కొత్త వారిని ఎంపిక చేయనున్న నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. క్రికెట్​ అడ్వైజరీ కమిటీలో మార్పులు చేస్తూ సభ్యులుగా ఉన్న మాజీ సీమర్​ మదన్​ లాల్, రుద్ర పతాప్​ సింగ్ స్థానాల్లో భారత మాజీ ప్లేయర్స్​ అశోక్​ మల్హోత్రా, జతిన్​ను మెంబర్స్​గా నియమించింది.

Ashok Malhotra Jatin Paranjape named in new Cricket Advisory Committee
బీసీసీఐ మరో కీలక నిర్ణయం.. క్రికెట్​ అడ్వైసరి కమిటీలో మార్పులు!

By

Published : Dec 1, 2022, 5:11 PM IST

ముగ్గురు సభ్యులున్న క్రికెట్​ అడ్వైసరి కమిటీలో మార్పులు చేస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కమిటీలో మెంబర్స్​గా ఉన్న మాజీ సీమర్​ మదన్​ లాల్, రుద్ర పతాప్​ సింగ్ స్థానాల్లో భారత మాజీ ప్లేయర్స్​ అశోక్​ మల్హోత్రా, జతిన్​(jatin paranjape)ను సభ్యులుగా నియమించింది. మరో సభ్యును నాయక్​ను మాత్రం అలానే ఉంచింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు. కాగా, ​వచ్చే నెలలో సీనియర్​ సెలక్షన్ కమిటీ పోస్టులకు కొత్త వారిని ఎంపిక చేయనున్న నేపథ్యంలో క్రికెట్​ అడ్వైజరీ కమిటీలో ఈ మార్పులు చేసింది బోర్డు.

"భారత్​ తరఫున మల్హోత్రా ఏడు టెస్టులు, 20 వన్డేలు ఆడారు. రీసెంట్​గా ఇండియన్​ క్రికెటర్స్​ అసోసియేషన్​కు అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఇక జతిన్​కు నాలుగు వన్డేలు ఆడారు. అలాగే సీనియర్​ పురుషుల సెలక్షన్​ కమిటీకి కూడా ఆయన సభ్యులు" అని జైషా పేర్కొన్నారు.

ఇటీవలే జరిగిన ప్రపంచకప్​ తుది జట్టులో టీమ్​ఇండియా ప్లేయర్స్​ను ఎంపిక చేసిన విషయమై సర్వత్రా విమర్శలు వచ్చాయి. అందుకు తగ్గట్టే ఈ మెగాటోర్నీ మన ఆటగాళ్లు కూడా సరైన ప్రదర్శన చేయలేకపోయారు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుని.. టీమ్ఇండియా మాజీ పేసర్​ చేతన్​ శర్మ నేతృత్వంలోని జాతీయ సీనియర్​ సెలెక్షన్​​ కమిటీని తొలిగించింది. ఆ పోస్టులకు దరఖాస్తులను సైతం ఆహ్వానించింది.

అయితే ఈ కమిటీలోని ఐదు పోస్టుల కోసం దాదాపు 50 మందికిపైగా దరఖాస్తు చేసుకొన్నట్లు తెలిసింది. అయితే వీరిలో మాజీ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్ మనిందర్‌ సింగ్‌, మాజీ ఓపెనర్ శివ్‌సుందర్ దాస్‌, వినోద్ కాంబ్లి ఉన్నారు. దరఖాస్తుదారుల్లో సుపరిచితమైన ఆటగాళ్లు వీరే.. ఇక మాజీ పేసర్‌ అజిత్‌ అగర్కార్‌ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే అగర్కార్‌ దరఖాస్తు చేశాడో లేదో మాత్రం తెలియరాలేదు. మొత్తంగా దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను బీసీసీఐ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

ఇదీ చూడండి:శాంసన్​ రికార్డ్సే బెటర్​.. అయినా పంత్​కే ఛాన్స్​లు ఎందుకు?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details