తెలంగాణ

telangana

By

Published : Jun 18, 2023, 7:50 PM IST

Updated : Jun 18, 2023, 7:56 PM IST

ETV Bharat / sports

మొయిన్‌ అలీకి బిగ్‌ షాకిచ్చిన ఐసీసీ

Ashes series 2023 : ఇంగ్లాండ్, ఆసీస్‌ జట్ల మధ్య యాషెస్ సిరీస్‌ తొలి టెస్టులో మొయిన్‌ అలీకి జరిమానా పడటంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ వచ్చి చేరింది. ఆ వివరాలు..

మొయిన్‌ అలీకి బిగ్‌ షాకిచ్చిన ఐసీసీ
మొయిన్‌ అలీకి బిగ్‌ షాకిచ్చిన ఐసీసీ

Ashes series 2023 : ఇంగ్లాండ్‌ సీనియర్​ స్పిన్ ఆల్‌రౌండర్ మొయిన్‌ అలీకి ఐసీసీ పెద్ద షాక్ ఇచ్చింది. అతడికి జరిమానా విధిస్తూ ప్రకటన జారీ చేసింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్‌ తొలి టెస్టులో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తూ జరిమానా విధించింది. ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.20ని ఉల్లంఘించినందుకు ఈ ఫైన్ విధిస్తున్నట్లు పేర్కొంది. లెవల్‌ 1 నేరం కింద పరిగణిస్తున్నట్లు వెల్లడించింది.

Aus VS Eng : ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్ భాగంగా​ రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 89 ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చే ముందు మొయిన్ అలీ బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేశాడు. ఆ సమయంలో తన చేతులకు డ్రెయింగ్‌ ఏజెంట్‌తో స్ప్రే చేయించుకున్నాడు. అయితే ఈ సిరీస్‌ ప్రారంభానికి ముందు అంపైర్‌లు.. ప్లేయర్స్​కు కొన్ని నిబంధనలను విధించారు. వారి అనుమతి లేకుంగా చేతికి ఎటువంటి క్రీమ్‌లు పూయడం లేదా స్ప్రేలు చేయకూడదని రూల్స్​ పెట్టారు. ఇలాంటివి చేయాలంటే ముందుగా అంపైర్ల పర్మిషన్​ తీసుకోవాలని చెప్పారు.

కానీ, మొయిన్ అలీ వాటిని ఉల్లంఘించాడు. పర్మిషన్​ తీసుకోకపోవడంతో మ్యాచ్‌ రిఫరీ సూచనల మేరకు.. ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్‌ అతడి ఫైన్​ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌ ఫీజ్‌లో 25 శాతం ఫైన్ విధించింది. అలాగే అతడి ఖాతాలో ఓ డీమెరిట్‌ పాయింట్‌ విధించింది. గత 24 నెలల్లో అతడి రికార్డును పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది.

భారీ జరిమానా పడకుండా.. తన చేతులను పొడిగా చేసుకొనేందుకు మాత్రమే స్ప్రే వాడినట్లు మొయిన్‌ అలీ వివరణ ఇచ్చాడు. ఈ సమాధానంతో మ్యాచ్‌ రిఫరీ సంతృప్తి చెందాడు. అలా అతడు భారీ జరిమానా పడకుండా తప్పించుకున్నాడు. ఐసీసీ 41.3 రూల్​ ప్రకారం ఎవరైనా బంతి ఆకారం మార్చేందుకు ప్రయత్నిస్తే.. 50 శాతం వరకు మ్యాచ్‌ ఫీజ్‌లో జరిమానా విధిస్తారు. అలానే రెండు డీమెరిట్‌ పాయింట్లను కూడా జత చేస్తారు. కానీ అతడు ఇలా చేయనందున.. లెవల్‌ 1 నేరం కింద జరిమానా విధించారు.

మొయిన్‌ సూపర్ డెలివరీ.. క్లిష్ట సమయాల్లో వికెట్ తీయడం మొయిన్​ అలీ ప్రత్యేకత. ఇప్పుడు జరుగుతున్న తొలి టెస్టులోనూ అతడు ఇలానే కీలక వికెట్‌ను పడగొట్టి అందరినీ ఆకట్టుకున్నాడు. క్రీజ్‌లో పాతుకుపోయిన కామెరూన్ గ్రీన్‌ (38)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు.

Last Updated : Jun 18, 2023, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details