తెలంగాణ

telangana

ETV Bharat / sports

Ashes 2021: ఇంగ్లాండ్ క్రికెటర్లను కవ్వించిన పైన్

ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్(Tim Paine News) మాటల యుద్ధానికి తెరలేపాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ సహా ఎవరొచ్చినా రాకున్నా యాషెస్ సిరీస్(Ashes Series)​ ఆగదని ఘూటు వ్యాఖ్యలు చేశాడు.

joe root
రూట్​

By

Published : Oct 2, 2021, 8:24 AM IST

Updated : Oct 2, 2021, 9:17 AM IST

యాషెస్‌ సిరీస్‌కు(Ashes 2021) రెండు నెలల ముందుగానే ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పైన్‌(Tim Paine News) మాటల యుద్ధానికి తెరలేపాడు. ఆసీస్‌లో కరోనా నిబంధనలపై ఇంగ్లాండ్‌ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పైన్‌ ఘాటుగా స్పందించాడు. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌(Joe Root Ashes) సహా ఎవరొచ్చినా.. రాకున్నా యాషెస్‌ ఆగదని స్పష్టంచేశాడు. ఆసీస్‌లో కరోనా కఠిన ఆంక్షల కారణంగా ఇంగ్లాండ్‌ క్రికెటర్ల వెంట కుటుంబ సభ్యులకు అనుమతి లేదు. ఈ నిబంధనతో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు యాషెస్‌ సిరీస్‌కు వెళ్లాలా? లేదా? అన్న డైలామాలో పడ్డారు. కొందరు ఆటగాళ్లు యాషెస్‌కు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

"యాషెస్‌ సిరీస్‌(Ashes Series) యధావిధిగా జరుగుతుంది. రూట్‌ వచ్చినా.. రాకున్నా మొదటి టెస్టు డిసెంబరు 8న ప్రారంభమవుతుంది. వారందరూ రావాలనే కోరుకుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. సాధ్యమైనంత మేరకు అత్యుత్తమ పరిస్థితుల్లో ఉండేందుకు ప్రయత్నిస్తారు. అందరం అంతే. బయో బబుల్‌ ఆంక్షలకు పరిష్కారం కనుక్కోవచ్చు. ఆ తర్వాత విమానం ఎక్కాలా? లేదా? అన్నది వారిష్టం. ఇక్కడికి రావాలని ఏ ఒక్క ఇంగ్లాండ్‌ ఆటగాడిని ఎవరూ బలవంతం చేయట్లేదు. ఈ ప్రపంచంలో ఎలా బతకాలో నిర్ణయించుకునే ఎంపిక మనదే. మీకు రావాలని లేకపోతే.. రాకండి. కెవిన్‌ పీటర్సన్‌ మంచి విశ్లేషకుడు. మిత్రమా కెవిన్‌.. ఈ వ్యవహారాన్ని ఆటగాళ్లకు వదిలేయండి. వారిని మాట్లాడనివ్వండి. ఆసీస్‌కు రావట్లేదంటూ ఏ ఒక్క ఇంగ్లాండ్‌ ఆటగాడు బహిరంగంగా మాట్లాడటం నేను వినలేదు. కెవిన్‌ లాంటి వ్యక్తులు వీలైనప్పుడల్లా మీడియాలో ప్రచారం కోరుకుంటారు" అని పైన్‌ తెలిపాడు. డిసెంబరు 8న ప్రారంభమయ్యే అయిదు మ్యాచ్‌ల యాషెస్‌ సిరీస్‌ జనవరి 18న ముగియనుంది.

Last Updated : Oct 2, 2021, 9:17 AM IST

ABOUT THE AUTHOR

...view details