Ashes 2021: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టెస్టు జట్ల మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో గెలుపు కోసం ఇరు జట్లు ఉరకలేస్తున్నాయి. అయితే.. ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు గబ్బా వేదికగా జరగనుంది.
ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ఆస్ట్రేలియా జట్టు దృఢంగా కనిపిస్తోంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ జట్టులో కీలక ఆటగాడు కానున్నాడు. మరోవైపు టెస్టుకు ఇంగ్లాండ్ కీలక బౌలర్ జిమ్మీ ఆండర్సన్, జానీ బెయిర్ స్టో దూరమవడం కావడం కెప్టెన్ జో రూట్‌పై కాస్త ఒత్తిడి పెరిగింది. పైగా.. గబ్బా వేదికగా ఇంగ్లాండ్ ఇప్పటివరకు రెండు టెస్టు మ్యాచ్‌లే గెలవడం కూడా రూట్‌పై ఒత్తిడి పెంచే అంశంగా మారింది.
యాషెస్‌లో ఇలా..
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటివరకు 71 యాషెస్ సిరీస్‌లు జరిగాయి. అందులో ఆసీస్ జట్టు 33, ఇంగ్లాండ్ 32 విజయాలు సాధించాయి. ఆరు సిరీస్‌లు డ్రాగా ముగిశాయి. ఈ సారి సిరీస్ నెగ్గి ఆస్ట్రేలియాను సమం చేయాలనే పట్టుదలతో రూట్ సేన ఉంది. మ్యాచ్‌ల పరంగా చూసుకుంటే మొత్తం 335 టెస్టులు జరగ్గా.. కంగారూ జట్టు 136, ఇంగ్లాండ్ 108 చొప్పున గెలిచాయి. 91 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.
ఆస్ట్రేలియా జట్టు: మార్కస్ హారిస్, డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కేరీ(వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, న్యాథన్ లయాన్, జోష్ హేజిల్‌వుడ్.