Ashes 2021 live: యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా పట్టుబిగిస్తోంది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 425 పరుగులకు ఆలౌటైంది. 343/7తో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ మరో 62 పరుగులు జోడించి ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో 278 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ట్రెవిస్ హెడ్ (152) భారీ శతకంతో అదరగొట్టగా.. స్టార్క్ (35) అతడికి మద్దతుగా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో రాబిన్సన్, మార్క్ వుడ్ చెరో మూడు వికెట్లతో రాణించగా క్రిస్ వోక్స్ 2, లీచ్, రూట్ చెరో వికెట్ సాధించారు.
Ashes 2021: తొలి టెస్టులో పట్టుబిగిస్తున్న ఆసీస్.. ఇంగ్లాండ్ 107/2 - యాషెస్ 2021 లైవ్ అప్డేట్స్
Ashes 2021 live: బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న తొలి టెస్టులో ఆసీస్ పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో 425 పరుగులకు ఆలౌటైన కంగారూ జట్టు కీలక ఆధిక్యం సంపాదించింది. ప్రస్తుతం టీ విరామ సమయానికి రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది ఇంగ్లాండ్.
Ashes 2021
ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ మూడో రోజు టీ విరామ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. బర్న్స్ (13), హమీద్ (27) మరోసారి విఫలమయ్యారు. రూట్ (26), మలన్ (35) క్రీజులో ఉన్నారు. ఇంకా 171 పరుగులు వెనకపడి ఉంది ఇంగ్లీష్ జట్టు.