Josh Hazlewood Injury: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో గెలిచి జోరుమీదున్న ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా రెండో టెస్టుకు ఇతడు దూరమయ్యాడు. దీంతో స్కానింగ్ కోసం ఇతడు సిడ్నీకి పయనమయ్యాడు. రెండో టెస్టు జరగబోయే అడిలైడ్‌కు జట్టుతో పాటు ఇతడు వెళ్లలేదు. డిసెంబర్ 26న ప్రారంభంకాబోయే మూడో టెస్టుకు హేజిల్‌వుడ్ అందుబాటులో ఉండేది లేనిది త్వరలో వెల్లడిస్తామని ఆసీస్ క్రికెట్ బోర్డు తెలిపింది.
Ashes 2021: ఆసీస్‌కు ఎదురుదెబ్బ.. గాయంతో స్టార్ పేసర్ దూరం - యాషెస్ హేజిల్‌వుడ్ దూరం
Josh Hazlewood Injury: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య గురువారం రెండో టెస్టు ప్రారంభంకానుంది. అయితే ఈ కీలక డేనైట్ టెస్టుకు ముందు ఆసీస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ జట్టు పేసర్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.
గురువారం ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య అడిలైడ్ వేదికగా డేనైట్ టెస్టు ప్రారంభంకానుంది. ఈ టెస్టు కోసం ఇప్పటివరకైతే రిప్లేస్మెంట్ను ప్రకటించలేదు ఆసీస్. ఇతడి స్థానంలో జే రిచర్డ్సన్ లేదా మైకేల్ నిసెర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
Ahesh 2021: ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లీష్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేసి 278 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో జో రూట్ (89), డేవిడ్ మలన్ (82) రాణించడం వల్ల ఇంగ్లాండ్ మళ్లీ రేసులోకి వచ్చినట్లు అనిపించింది. అయితే కీలకమైన సమయాల్లో వికెట్లను చేజార్చుకున్న పర్యాటక జట్టు 297 పరుగులకే ఆలౌటైంది. ఆఖరి ఎనిమిది వికెట్లకు 74 పరుగులను మాత్రమే జోడించడం గమనార్హం. అనంతరం 20 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.