James Anderson Ashes 2021: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ జట్టుకు గట్టి దెబ్బ తగిలింది. పిక్క కండరాల గాయంతో ఆ జట్టు స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ గబ్బాలో జరగబోయే తొలి టెస్టుకు దురమైనట్లు తెలుస్తోంది. 2019లో జరిగిన యాషెస్‌లోనూ ఇదే గాయంతో పూర్తి టోర్నీ నుంచి వైదొలిగాడు జిమ్మీ. ఇతడి స్థానంలో మరో పేసర్ క్రిస్ వోక్స్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ సిరీస్‌లో భాగంగా రెండు డేనైట్ టెస్టులు జరగనున్నాయి. ఇందుకోసం అండర్సన్ ఫిట్‌గా ఉండటం అవసరమని భావించిన యాజమాన్యం తొలి టెస్టుకు అతడికి విశ్రాంతినివ్వాలని చూస్తోంది. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టు వరకు ఇతడు కోలుకునే వీలుంటుందని భావిస్తోంది. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య బుధవారం తొలి టెస్టు జరగనుంది.