తెలంగాణ

telangana

By

Published : Dec 24, 2021, 11:55 AM IST

ETV Bharat / sports

'అలా ఎలా అంటావ్?'.. రూట్​కు అండర్సన్ కౌంటర్

Anderson on Root comments: అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమికి బౌలర్లను నిందిస్తూ వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్. తాజాగా ఈ వ్యాఖ్యల్ని తప్పుబట్టాడు ఆ జట్టు స్టార్ పేసర్ అండర్సన్. బ్యాటర్లు సరిగా బ్యాటింగ్ చేయలేకపోవడం వల్లే ఓడిపోయామని ప్రతివిమర్శలు చేశాడు.

James Anderson on Root, James Anderson opposes Joe Root comments, రూట్​పై అండర్సన్ కామెంట్స్, అండర్సన్ యాషెస్
James Anderson

Anderson on Root comments: యాషెస్ సిరీస్​లో పేలవ ప్రదర్శన చేస్తోంది ఇంగ్లాండ్. ఆస్ట్రేలియా చేతిలో ఇప్పటికే తొలి రెండు టెస్టులు ఓడిపోయింది. అడిలైడ్ వేదికగా జరిగిన డేనైట్​ టెస్టులో చివరి వరకు పోరాడి పరాజయంపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తమ బౌలర్లు సరైన విధంగా బౌలింగ్ చేయలేదని మాట్లాడాడు ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ జో రూట్. తాజాగా ఈ విషయంపై స్పందించిన స్టార్ పేసర్ అండర్సన్.. బ్యాటర్లపై నిందలు వేశాడు.

"అడిలైడ్​ లాంటి ఫ్లాట్​ పిచ్​పై మా బ్యాటర్లు సరైన విధంగా బ్యాటింగ్ చేయలేకపోయారు. ఏ బౌలర్ అయినా మంచి లెంగ్త్​లోనే బౌలింగ్ చేయాలని అనుకుంటాడు. తొలి రెండు రోజులు మేము మా శాయశక్తులా గొప్ప బంతుల్ని వేయడానికి ప్రయత్నించాం. కొన్నిసార్లు బంతులు సరైన స్థానంలో పడలేదు. జట్టుగా మరింత క్రియాశీలకంగా ఆడాల్సి ఉంది. ఓటమికి కేవలం బౌలర్లను నిందించడం సరికాదు."

-అండర్సన్, ఇంగ్లాండ్ పేసర్

Ashes 2021: అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టులో ఇంగ్లాండ్​పై 275 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది ఆస్ట్రేలియా. ఇంగ్లీష్ బ్యాటర్లలో రూట్, మలన్ తప్ప ఎవ్వరూ గొప్పగా బ్యాటింగ్ చేయలేదు. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు మెల్​బోర్న్ వేదికగా ఈనెల 26న ప్రారంభవుతుంది.

ఇవీ చూడండి: 'అదే జరిగితే శార్దూల్​కు జట్టులో చోటివ్వాలి'

ABOUT THE AUTHOR

...view details