Ashes 2021: యాషెస్ సిరీస్‌లో ఇప్పటికే రెండు టెస్టుల్లో ఓడిపోయి ఒత్తిడిలో పడిపోయిన ఇంగ్లాండ్ మూడో టెస్టులోనూ ఓటమికి దగ్గరవుతోంది. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ జట్టు 185 పరుగులకు ఆలౌటవ్వగా.. ఆసీస్ 267 పరుగులు సాధించింది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో కంగారూ జట్టుకు 82 పరుగుల ఆధిక్యం లభించింది. మార్కస్ హారిస్ (76) అర్ధశతకంతో రాణించాడు.
Ashes 2021: కష్టాల్లో ఇంగ్లాండ్.. రెండో ఇన్నింగ్స్‌లో 31/4 - యాషెస్ 2021 మూడో టెస్టు లైవ్ న్యూస్
Ashes 2021: యాషెస్ సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో పడింది ఇంగ్లాండ్. ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో ఓడిపోయిన ఇంగ్లీష్ జట్టు మూడో టెస్టులోను ఓటమికి దగ్గరైంది. ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది రూట్‌సేన.
![Ashes 2021: కష్టాల్లో ఇంగ్లాండ్.. రెండో ఇన్నింగ్స్‌లో 31/4 Ashes 2021 3rd test live, Ashes 2021 3rd test Ashes 2021 3rd test latest news, యాషెస్ మూడో టెస్టు స్కోర్ కార్డ్, యాషెస్ మూడో టెస్టు లైవ్ న్యూస్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14022278-493-14022278-1640597862508.jpg)
Ashes 2021
ఇక రెండు రోజు ఆట ముగిసే సమయానికి కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది ఇంగ్లాండ్. హమీద్ (7), క్రాలే (5), మలన్ (0), జాక్ లీచ్ (0) దారుణంగా విఫలమయ్యారు. దీంతో 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది ఇంగ్లీష్ జట్టు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రూట్ (12*)తో కలిసి ఆల్‌రౌండర్ స్టోక్స్ (2*) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. దీంతో 31/4తో రెండో రోజును ముగించింది ఇంగ్లాండ్. ప్రస్తుతానికి ఆసీస్ 51 పరుగుల ఆధిక్యంలో ఉంది.