Ashes 2021 Corona: యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది. డేనైట్ ఫార్మాట్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కరోనా కలకలం రేపింది. ఆటగాళ్లకు ఎవ్వరికీ ఇబ్బంది లేకపోయినా.. ఈ టెస్టు కోసం పనిచేస్తున్న బ్రాడ్కాస్ట్ సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది. ఈ విషయాన్ని మైదానం అధికారులు వెల్లడించారు. టెస్టు మాత్రం ఐదురోజుల పాట యాథావిధిగా జరుగుతుందని తెలిపారు.
Ashes 2021: యాషెస్ సిరీస్‌లో మరోసారి కరోనా కలకలం - యాషెస్ 2021 బ్రాడ్కాస్ట్ సిబ్బందికి కరోనా
Ashes 2021 Corona: యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ మైదానంలో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది. కాగా, ఈ మ్యాచ్ కోసం పనిచేస్తున్న బ్రాడ్కాస్ట్ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలడం ఆటగాళ్లను కలవరపెడుతోంది.
"అడిలైడ్ వేదికగా జరుగుతున్న యాషెస్ రెండో టెస్టు కోసం పనిచేస్తున్న బ్రాడ్కాస్ట్ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలిందని తెలియజేస్తున్నాం. ఈ విషయంలో విచారణ జరిపి అతడికి దగ్గరగా ఉన్నవారిని ఐసోలేషన్‌కు పంపించాం. అలాగే ఆ ప్రదేశాన్నంతటినీ శానిటైజ్ చేశాం" అని అడిలైడ్ మైదాన అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
కరోనా సోకిన వ్యక్తితో కాంటాక్ట్‌లో ఉన్న కారణంగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రెండో టెస్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం అతడు ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఈ సిరీస్‌లో భాగంగా తర్వాతి రెండు మ్యాచ్‌లు జరగబోయే సిడ్నీ, మెల్బోర్న్లో కేసులు పెరుగుతూ ఉన్నాయి. దీంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.